మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలుతెలిపిన టి.ఎఫ్.జె.ఏ. కార్యవర్గం..

సూపర్ తెలుగు న్యూస్, హైదరాబాద్, అక్టోబర్14, 2022:మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు గురువారం ఆయనను నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో తేనీటి విందులో పాల్గొన్న చిరంజీవి తన చిత్రాలను గురించి సవివరంగా ముచ్చటించారు.

‘ఆచార్య’ మూవీ తదనానంతర పరిణామాలను మనసు విప్పి చెప్పారు. అలానే ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ తర్వాత తనను కలిసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్న వారిని కలుసుకోవడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. ‘ఆచార్య’ పరాజయానికి తాను కృంగిపోలేదని, ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ విజయానికి పొంగి పోవడం లేదని, అలాంటి స్థితప్రజ్ఞతను సాధించానని చెప్పారు.

‘లూసిఫర్’ ను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ లో బలంగా కలిగించాడని, అతనికి దర్శకత్వం వహించే తీరిక లేకపోవడంతో వేరెవరితో అయినా ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించమని సలహా ఇచ్చాడని అన్నారు. ఒకానొక సమయంలో ఆ చిత్రం రీమేక్ ఆలోచన విరమించుకున్నానని, అయితే రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మోహన రాజా ను ఎంపిక చేయడంతో మళ్లీ పట్టాలు ఎక్కిందని, అతని బృందం ‘లూసిఫర్’ మూవీని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, అది వర్కౌట్ అయ్యిందని చిరంజీవి అన్నారు.

ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు రచయితలూ తన కోసం వైవిధ్యమైన కథలు చేస్తారనే నమ్మకం కలిగిందని, కరోనా సమయంలో ప్రేక్షకులలో వచ్చిన మార్పు కారణంగానే తానూ ‘లూసిఫర్’ లాంటి విభిన్న చిత్రాన్ని ధైర్యంతో చేశానని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’, మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ చిత్రాల విశేషాలనూ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో తనకున్న చిరకాల అనుబంధాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. హెల్త్ కార్డుల పంపిణీ సమయంలో అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు.

‘గాడ్ ఫాదర్’ లాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని చేయాలని, ఆ రకంగా తామంతా మళ్ళీ మళ్ళీ కలిసే ఆస్కారం ఏర్పడుతుందని టి.ఎఫ్.జె.ఎ. అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీ నారాయణ, వై. జె. రాంబాబు తెలిపారు. అయితే… సినిమాలతో సంబంధం లేకుండానే తనను కలుసుకోవాలని తాను కోరుకుంటానని, ఇలాంటి ఆత్మీయ కలయికతో తనకు గూస్ బంబ్స్ వస్తాయని చిరంజీవి బదులిచ్చారు.

గాడ్ ఫాదర్ మూవీ లో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న స్టార్ డైరెక్టర్…

ఖైదీ నంబర్ 150 వ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి , ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని స్టైలిష్ డైరైక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సైరా నరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజువల్ గ్రాండియర్ , సురేందర్ రెడ్డి టేకింగ్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..

సైరా నరసింహారెడ్డి మూవీ తరువాత .. చిరంజీవి కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు .. ఈ మూవీ కి సంబంధించి , మోషన్ పోస్టర్ , టీజర్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ త్వరలనే రిలీజ్ చేస్తాను అని అఫీషియల్ ఎనౌన్సుమెంట్…

ఆచార్య మూవీ తరువాత … మెగా స్టార్ చిరంజీవి చేతిలో వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు .. ఈ మూవీ నుండి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది .. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శెరవేగంగా జరుగుతుంది ..

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ..ఈ మూవీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసింది .. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం పూరీ చాలా స్టోరీస్ రెడీ చేశారు , కానీ అప్పటికి అవి ఫైనలైజ్ కాక చిరు ఖైదీ నెంబర్ 150 వ సినిమా చేశారు .. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అయితే పూరీ కూడా మెగా స్టార్ తో ఎప్పటికైనా సినిమా చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు గాడ్ ఫాదర్ మూవీ లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది . గాడ్ ఫాదర్ మూవీ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నారు అని మెగా స్టార్ చిరంజీవి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది .. మరి అసలు గాడ్ ఫాదర్ మూవీ లో పూరీ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతోంది . పూరీ స్క్రీన్ టైమ్ ఈ మూవీ లో ఎంత సేపు ఉండబోతోందో ..తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే…