ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై నోరు విప్పండి..మోడీ కి ఆడారి కిషోర్ సవాల్..

తెలుగు సూపర్ న్యూస్, మే 6, 2024:ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై నోరు విప్పి, నిజాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి లోక్ సభ ఇంచార్జి ఆడారి కిషోర్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ చట్టం అద్భుతంగా ఉందని, తమ పార్టీ మద్దతు ఇస్తోందని, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లోనే చెప్పారన్నారు. ఈ చట్టం పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లపై సిఐడి కి ఫిర్యాదు చేశామని, వాళ్ళు విచారణ చేస్తారన్నారు.

సీఎం రమేష్..డబ్బు మదం కాదు, దమ్ముంటే నాతొ డిబేట్ కి రా

కేవలం డబ్బు మదం తప్ప మరో అర్హత తప్ప కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు లేదని, దమ్ముంటే తనతో డిబేట్ కు రావాలని ఆడారి కిషోర్ కుమార్ సవాల్ విసిరారు. కడప నుంచి కోట్లాది రూపాయలతో వలస వచ్చి, అనకాపల్లి ని ఉద్ధరిస్తానని బీజేపీ అభ్యర్థిగా వచ్చారని, అతనికి కనీసం అనకాపల్లి ఎల్లలు కూడా తెలియదన్నారు.

గత పదేళ్లుగా రాజ్యసభగా సభ్యునిగా ఆంధ్ర ను ఏమాత్రం ఉద్దరించారో చెప్పాలన్నారు. తనకు ఏపీ లోని సమస్యలు పూర్తిగా అవగాహనా ఉందని, సీఎం రమేష్ కు దమ్ముంటే తనతో ఓపెన్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు.

కడప, తెలంగాణ కు చెందిన వందలాదిగా వాహనాలు తరలించి అనకాపల్లి లో ప్రచారం వాడుతున్నారన్నారు. అతని చిత్తశుద్ధి ఇక్కడే తెలిసిందన్నారు. స్థానిక వాహనాలను వాడితే స్థాయి స్థానిక యువతకు కొంత ఉపాధి జరుగుతుందన్నారు. కనీసం ఈ మాత్రం సాయం కూడా స్థానికులకు చెయ్యడం ఇష్టపడని వ్యక్తి ఎంపీ అయితే ఏమి ఉద్ధరిస్తాడని మండిపడ్డారు.

ఇక అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ గతంలో మంత్రిగా ఉంది ఏమి ఉద్దరించాడో తమకు తెలుసునని, అతని గురించి వ్యాఖ్యానించడం కూడా సమయం వృధా అన్నారు.

ఈ సమావేశంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి వైఎస్ ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ గా అడారి కిషోర్ కుమార్..?

తెలుగు సూపర్ న్యూస్, ఏప్రిల్ 24,2024: యువనేత జనహృదయనేత.. ఆడారి కిషోర్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అంతేకాదు ఆయనకు జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. క్రియాశీలకంగా వ్యవహరించి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేసి ప్రజలకోసం నిలబడ్డారు. ఆపదలో ఉన్నవారికి అవసరమైన సాయం అందిస్తూ జనాల సమస్యలను పరిష్కరించారు.

ఆడారి కిషోర్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నో సందర్భాలుగా ద్వితీయ స్థాయి నాయకులు కార్యకర్తలు ఇదే అభిప్రాయం బహిరంగంగా ఆయనతో చెప్పారుకూడా.. ఐనా గానీ కేవలం చంద్రబాబు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న గౌరవంతో ఆడారి కిషోర్ కుమార్ ఎటువంటి పదవులు దక్కకపోయినా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారు.

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో..

దాదాపు పద్నాలుగు లక్షల జనాభా కలిగిన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా కాపుల ఓట్లతో పాటు, వెలమ, గవర సామాజిక వర్గాల ఓటర్లు 75 శాతానికి పైగా ఉంటాయి. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ఎప్పుడు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి.

అనకాపల్లి ఎంపీ స్థానానికి..

అయితే అనూహ్య పరిణామాల మధ్య.. తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంటు స్థానానికి టికెట్ ఆశావహులుగా ఉన్న ఆడారి కిషోర్ కుమార్ స్వయంగా సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

స్కిల్ స్కాం వ్యవహారంలో..

స్కిల్ స్కాం వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు స్వయంగా వైజాగ్ విమానాశ్రయం రన్వే పైనే ఆందోళన చేసినందుకు ఆయనపై కేంద్ర సాయుధ బలగాల అధికారులు కేసులు కూడా పెట్టారు. నారా లోకేష్ యువగళం యాత్రకు కూడా.. ఆడారి కిషోర్ కుమార్ తన శక్తికి మించి ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఆయనకు ఇస్తారని స్పష్టమైన సమాచారం అందడంతో.. ఎన్నో ఏళ్లుగా తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం వాళ్ల కోరిక మేరకు అడారి కిషోర్ కుమార్ వైయస్సార్సీపి తీర్థం పుచ్చుకున్నారు.

గత ఎన్నికల్లో..

గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్ భీసెట్టి సత్యవతి ఆ సమయంలో వచ్చిన జగన్ వేవ్ ద్వారా మాత్రమే గెలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తన పొలిటికల్ కెరీర్ లో..

ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో.. గ్రౌండ్ లెవెల్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడంలో విఫలం అవడంతో… ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో బలమైన నేత కోసం ఎదురుచూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆడారి కిషోర్ కుమార్ రూపంలో ఒక బలమైన నాయకుడు దొరికాడు. మరో రెండు మూడు రోజుల్లో అనకాపల్లి పార్లమెంటు సీటు అడారి కిషోర్ కుమార్ కు ప్రకటించే అవకాశం ఉంది.

జనాల మనిషిగా..

జగన్ మోహన్ రెడ్డికి తగ్గట్లుగా అడారి కిషోర్ కుమార్ కూడా.. దూకుడుగా వ్యవహరించగలిగే యువ నేత. ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అన్నివిధాలా ప్రజలకు తనవంతుగా సాయం అందిస్తున్నారు. అటు సామాజిక సమీకరణలతో పాటు ప్రజల్లో ఎంతగానో మంచి పేరు ఉన్న జనహృదయనేత అడారి. కాబట్టి కొన్ని రోజుల్లో అడారి కిషోర్ కుమార్ కు టికెట్ ప్రకటించాలని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అడారి కిషోర్ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.