జూన్ 23 నుంచి 25 వరకు స్వాస్థ్య ఆయుష్ & వెల్ నెస్ ఎక్స్ పో-2023

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, 12 జూన్ 2023: మరో అద్భుత కార్యక్రమానికి భాగ్యనగరం వేదిక కానుంది. ఆరోగ్యంపై అవగాహన కల్పించే.. ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తెచ్చే స్వాస్థ్య ఆయుష్ & వెల్ నెస్ ఎక్స్ పో – 2023 మూడు రోజుల పాటు జరగనుంది.

హై టెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జూన్ 23 నుంచి 25 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దీనికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో స్వాస్థ్య దీన్ని చేపడుతోంది.

గ్లోబల్ ఆయుష్ & వెల్ నెస్ ఎక్స్ పో వివరాలను స్వాస్థ్య ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫణిశ్రీ కొంటె (ప్రెసిడెంట్), డాక్టర్ సత్యనారాయణ దోర్నాల (సెక్రెటరీ జనరల్), కన్వీనర్లు డా. సునీత గ్రేస్, డా. కల్పన, డా. సత్యదీప, డా. వైదేహి, డా. కృష్ణ నాయక్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది.

గ్లోబల్ ఆయుష్ ను ఒకే గొడుకు కిందకు చేర్చడమే ఈ ఎక్స్ పో ముఖ్య ఉద్దేశం. ఆయుర్వేదం, యోగ & నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. హెల్త్ & వెల్ నెస్, ఫుడ్, న్యూట్రీషన్, ఫార్మా, బ్యూటీ & టూరిజం గురించి కూడా విలువైన ఎన్నో విషయాలను తెల్సుకోవచ్చు. అపార అనుభవం ఉన్న ప్రాక్టీషనర్స్, మెడికల్ మాన్యుఫాక్చరర్స్, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు ఎందరో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు.

ఎక్స్ పో ముఖ్య లక్ష్యాలు:

*) హోలిస్టిక్ సిస్టమ్స్ పై అవగాహన కల్పించడం

*) వివిధ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ప్రజలకు వివరించడం

*) సంప్రదాయ వైద్య విధానం గురించి మరింత లోతుగా తెలియజేయడం

ఆయుష్, వెల్ నెస్ ఇండస్ట్రీకి మెగా ప్లాట్ ఫామ్ ను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో స్వాస్థ్య పని చేస్తోంది. దీని ఆధ్వర్యంలో ఆయుష్ & వెల్ నెస్ ఎక్స్ పో-2023ని ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్ లో జీ-20 అగ్రికల్చర్ మినిస్టర్స్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా.. ఎక్స్ పో కాన్ తేదీలను మార్చారు. జూన్ 23 నుంచి 25 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను swasthyaexpo.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Leave a Reply