శివ నిర్వాణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ హీరో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు స్టోరీ వినిపించిన శివ నిర్వాణ...
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు టాలివుడ్ లో మంచి క్రేజ్ ఉంది .. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు , హీరోగా , ప్రొడ్యూసర్ గా కూడా మారి ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు .. పెళ్లిచూపులు సినిమా తో హీరోగా కెరీర్ మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ..అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నాడు .. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సబ్జెక్ట్ సినిమా తరువాత విజయ్ ఓ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు .. 2018 లో డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా విజయ్ గీతా గోవిందం సినిమా లో నటించి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నారు .. గీత గోవిందం సినిమా తరువాత , డియర్ కామ్రేడ్, టాక్సీవాలా వంటి సినిమాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు .. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి లతోపాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ..ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తున్నారు ..
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . లైగర్ సినిమా తరువాత హీరో విజయ్ దేవరకొండ ఏ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయ్యారు అనే వార్త హాట్ టాపిక్ గా మారింది . లైగర్ సినిమా తరువాత విజయ్ చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది … ఈ నేపథ్యంలోనే నిన్నుకోరి, మజిలీ,టక్ జగదీష్ వంటి సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ తో విజయ్ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. టక్ జగదీష్ సినిమా తరువాత డైరెక్టర్ శివ నిర్వాణ ఏ సినిమా అఫీషియల్ గా ఎనౌన్సుమెంట్ చేయాలేదు .. అలాగే విజయ్ దేవరకొండ కూడా డైరెక్టర్ శివ నిర్వాణ తో సినిమా చేస్తున్నారు అనే విషయం పై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు . మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు అగలిసిందే …