ఆజాద్ ఇంజినీరింగ్ లో సచిన్ టెండూల్కర్ పెట్టుబడి

హైద‌రాబాద్, మే 15, 2023: క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎస్పీఎస్ ప‌రిశ్ర‌మల్లో గ్లోబ‌ల్ ఓఈఎంల‌కు ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే ప్రముఖ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్‌లో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డులు పెట్టారు. 

సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిన ఈ పెట్టుబడి భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు దోహదం చేయడానికి ఆజాద్ ఇంజనీరింగ్‌కు  మ‌రింత‌గా తోడ్పాటు అందిస్తుంది. ఈ కార్యక్రమాల ద్వారా భారతదేశం అంత‌ర్జాతీయంగా మ‌రింత ఎద‌గ‌డం, మ‌న తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, అంతర్జాతీయ ప్రమాణాలను అధిగమించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంద‌ర్భంగా ఆజాద్ ఇంజనీరింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ చోప్దార్ మాట్లాడుతూ, “సచిన్ టెండూల్కర్ మా సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మాకు గొప్ప గౌర‌వం. అత్యంత సంక్లిష్టమైన ఉత్ప‌త్తి,  స్వావలంబనను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్న సంస్థగా, ఆజాద్ మా విజ‌న్ మీద మ‌రింత‌గా దృష్టిసారిస్తుంది. భారతదేశానికి మరింత వృద్ధి, ఆవిష్కరణ అవకాశాలను సృష్టిస్తుంది” అని ఆశాభావం వ్య‌క్తంచేశారు.

గడిచిన‌ దశాబ్ద కాలంలో, ఆజాద్ ఇంజనీరింగ్ తన ఓఈఎం క్లయింట్ల డిమాండ్లను తీర్చడానికి పరిశ్రమ ప్రమాణాలను అధిగమించే అత్యాధునిక సౌకర్యాలు, ప్రాసెస్ ఇంజనీరింగ్ ప్రావీణ్యం, అసమానమైన సరఫరా సామర్థ్యం, మౌలిక సదుపాయాలతో గణనీయమైన వృద్ధిని సాధించింది.

బోయింగ్, జీఈ, మిత్సుబిషి, సీమెన్స్ ఎనర్జీ, హనీవెల్, ఈటన్, జీఈ ఏరోస్పేస్, బేకర్ హ్యూస్ వంటి అంతర్జాతీయ సంస్థల‌తో పాటు.. హెచ్ఏఎల్, గోద్రెజ్, టాటా, మహీంద్రా ఏరోస్పేస్ వంటి దేశీయ దిగ్గజాలతో కలిసి ఆజాద్ ఇంజనీరింగ్ పనిచేస్తోంది. 1500కు పైగా విడిభాగాలను తయారు చేసి 20కి పైగా దేశాలకు ఎగుమతి చేయడానికి కంపెనీ అర్హత సాధించింది. ఈ సంస్థ‌కు కొత్త‌గా ఏర్పాటుచేసిన రెండు భారీ, అత్యాధునిక ఉత్ప‌త్తి ప్లాంట్లు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి ఈ రెండూ ప్ర‌స్తుతం ఉన్న‌వాటి కంటే పది రెట్లు పెద్దవి. ఆజాద్ ఇంజనీరింగ్ ప్రెసిష‌న్ ఉత్ప‌త్తుల విష‌యంలో అపూర్వ విస్త‌ర‌ణ‌తో అద్భుత‌మైన వృద్ధిని సాధిస్తోంది.

Leave a Reply