తెలంగాణాలో తమ నూతన స్టోర్‌ను ప్రారంభించిన రాయల్‌ఓక్‌

హైదరాబాద్‌, 16ఏప్రిల్‌ 2023 : భారతదేశపు ఫర్నిచర్‌ బ్రాండ్‌ రాయల్‌ఓక్‌ తమ నూతన ప్రతిష్టాత్మకమైన స్టోర్‌ను హైదరాబాద్‌లోని రామచంద్రాపురం వద్ద ప్రారంభించించడం ద్వారా భారతదేశ వ్యాప్తంగా తమ స్టోర్ల సంఖ్యను 148కు చేర్చింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రసిద్ధ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ, రాయల్‌ఓక్‌ ఫర్నిచర్‌ ఛైర్మన్‌ విజయ్‌ సుబ్రమణియం, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మథన్‌ సుబ్రమణియం, డైరెక్టర్‌ శ్రీమతి మహేశ్వరి విజయ్‌ ; హెడ్‌–రిటైల్‌ హెచ్‌ ఎస్‌ సురేష్‌ ; స్టేట్‌ హెడ్‌–హైదరాబాద్‌ ప్రద్యుమ్న కరణం మరియు సేల్స్‌ అండ్‌ మర్చండైజింగ్‌ హెడ్‌ ప్రశాంత్‌ ఎస్‌ కొటియన్‌ పాల్గొన్నారు.

దాదాపు 21వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ స్టోర్‌ విస్తృత శ్రేణిలో లివింగ్‌ రూమ్స్‌, బెడ్‌రూమ్స్‌, డైనింగ్‌ రూమ్స్‌ అందిస్తుంది. వినియోగదారులు సోఫాలు, రిక్లైనర్స్‌, డైనింగ్‌, మ్యాట్రెసస్‌, బెడ్స్‌, డెకార్‌ మరియు సమగ్ర శ్రేణి ఆఫీస్‌, ఔట్‌ డోర్‌ ఫర్నిచర్‌ వంటివి ఇక్కడ పొందవచ్చు. ఆర్‌సీ పురం స్టోర్‌ రాయల్‌ఓక్‌కు హైదరాబాద్‌లో 18వ స్టోర్‌ కాగా, ఇది ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది సందర్శకులను ఆకర్షిస్తుందని అంచనా.

ఈ సందర్భంగా రాయల్‌ఓక్‌ ఇంక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ విజయ్‌ సుబ్రమణియం మాట్లాడుతూ ‘‘మా ప్రతిష్టాత్మకమైన బ్రాండ్‌ స్టోర్‌ను ప్రారంభించడం పట్ల రాయల్‌ఓక్‌ వద్ద మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ స్టోర్‌ ద్వారా మా వినియోగదారులకు మెరుగైన షాపింగ్‌ అనుభవాలను, ఉత్పత్తులు, గృహోపకరణాలు, మరెన్నో అందించేందుకు లక్ష్యంగా చేసుకున్నాము. హైదరాబాద్‌లో మా స్టోర్‌ల సంఖ్యను 35కు తీసుకువెళ్లడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము’’ అని అన్నారు.

ఈ స్టోర్‌లో ప్రత్యేకంగా కంట్రీ కలెక్షన్‌ కూడా లభిస్తుంది. వీటిలో అమెరికా, ఇటలీ, వియత్నాం, టర్కీ,జర్మనీ, మలేషియా,ఇండియా నుంచి పూర్తి వినూత్నమైన ఫర్నిచర్‌ సైతం లభించనుంది. రాయల్‌ఓక్‌ టీమ్‌ను అభినందించిన నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘నాణ్యతపట్ల ఈ కంపెనీ నిబద్ధత మరియు వినియోగదారుల సంతృప్తి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. వారి ప్రయత్నాలలో మరిన్ని విజయాలను వారు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Leave a Reply