నెల్లూరులో తమ నూతన స్టోర్‌ను లాంచ్ చేసిన రాయల్‌ఓక్
సూపర్ తెలుగు న్యూస్,నెల్లూరు, 5 ఏప్రిల్ 2023: భారతదేశపు ఫర్నిచర్ బ్రాండ్ రాయల్‌ఓక్ తమ నూతన స్టోర్‌ను నెల్లూరులో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రాయల్‌ఓక్ ఛైర్మన్ విజయ్ సుబ్రమణియం ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విజయ్‌సుబ్రమణియంతో పాటుగా రాయల్‌ఓక్ ఎండీ మథన్ సుబ్రమణియం, ఫ్రాంచైజీ ఓనర్ కె పురుషోత్తం రెడ్డి, రాయల్ ఓక్ ఫ్రాంచైజీ హెడ్ కిరణ్ చాబ్రియా, ఏపీటీఎస్ రాయల్‌ఓక్ హెడ్ ఫణి కుమార్ దాట్ల పాల్గొన్నారు.
రాయల్‌ఓక్ శ్రేణి సోఫాలు, రిక్లైనర్స్, డైనింగ్, మ్యాట్రెసస్, బెడ్స్, డెకార్, సమగ్ర శ్రేణి ఆఫీస్, ఔట్ డోర్ ఫర్నిచర్ కు సుప్రసిద్ధమైనది రాయల్‌ఓక్. ఈ శ్రేణిలో ఏడు దేశాల కలెక్షన్ ఉంది. ఇక్కడ అమెరికా, ఇటలీ, వియత్నాం, టర్కీ,జర్మనీ, మలేషియా,ఇండియా నుంచి పూర్తి వినూత్నమైన ఫర్నిచర్ అందుబాటులో ఉంది.
ఈ సందర్భంగా రాయల్‌ఓక్ ఇంక్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ ‘‘ఈ అత్యాధుక స్టోర్ ద్వారా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విలాసవంతమైన ఫర్నిచర్‌ను అందించనున్నాము. లివింగ్, డైనింగ్, హోమ్ డెకార్, బెడ్స్, ఆఫీస్, ఔట్‌డోర్ ఫర్నిచర్‌లో అద్భుతమైన కలెక్షన్ ఇక్కడ లభ్యమవుతుంది’’ అని అన్నారు.
నెల్లూరులో తమ మొట్టమొదటి స్టోర్ ప్రారంభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు రాయల్ ఓక్ ఇంక్.ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మథన్ సుబ్రమణియం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఫర్నిచర్‌ను నెల్లూరు వాసులు ఇప్పుడు తమ ఇంటి ముంగిటనే పొందవచ్చు.”అని, అతి సులభమైన వాయిదా పద్ధతుల్లో కూడా తమ విస్తృత శ్రేణి ఉత్పత్తులను పొందవచ్చు’’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణా ఫ్రాంచైజీ హెడ్ ఫణి కుమార్ దాట్ల మాట్లాడుతూ ‘‘మా ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ స్టోర్ ద్వారా మా వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవాలను, ఉత్పత్తులు, గృహోపకరణాలు మరెన్నో అందించేందుకుసిద్ధంగా ఉన్నామని, సమీప భవిష్యత్‌లో మరిన్ని స్టోర్‌లను తెరవనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఫ్రాంచైజీ యజమాని పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ‘‘ అనుభవపూర్వక షాపింగ్ అందించాలన్నది మా లక్ష్యం. మా స్టోర్‌ను అత్యంత జాగ్రత్తగా మరే ఇతర సంస్ధ అందించని అనుభవాలను అందించే రీతిలో రూపకల్పన చేశాము.’’ అని అన్నారు.
రాయల్‌ఓక్ ఫ్రాంచైజీ హెడ్ కిరణ్ ఛాబ్రియా మాట్లాడుతూ ‘‘ కంపెనీ అభివృద్ధి చెందేందుకు విస్తృతశ్రేణి అవకాశాలున్నాయి. తమ వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించగలము. సాటిలేని ధరలలో అంతర్జాతీయ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి కంపెనీ ప్రతిజ్ఞ చేసిందని” అన్నారు.