లక్షా ఎనభై ఐదు వేల రూపాయల విలువైన 50 పాఠశాల డ్యుయల్ డెస్క్‌లను ప్రభుత్వ పాఠశాలకు బహుకరించిన రౌన్డ్ టేబుల్ ఇండియా

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, మార్చి7, 2023:రౌండ్ టేబుల్ ఇండియా ,లేడీస్ సర్కిల్ ఇండియా సికింద్రాబాద్ రౌండ్ టేబుల్ 33 , SLC 17 (సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్) వింగ్స్ గోల్కొండ మండలంలోని వట్టినాగులపల్లి MPPS (మండల్ ప్రజా పరిషత్ పాఠశాల)కి సోమవారం లక్షా ఎనభై ఐదు వేల రూపాయల విలువైన 50 స్కూల్ డ్యూయల్ డెస్క్‌లను బహుకరించాయి. ఈ బల్లలను . ఎన్నారై వాసవి అసోసియేషన్ ఆర్థిక సహాయంతో ఆడించడం జరిగింది

సికింద్రాబాద్ రౌండ్ టేబుల్ 33(SRT 33) రౌండ్ టేబుల్ ఇండియాలో ఒక భాగం, దాని ఛైర్మన్ సుమన్ వేమూరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు; లేడీస్ సర్కిల్ ఇండియాకు చెందిన SLC 17 ఛైర్‌పర్సన్ మమత , దాని కార్యదర్శి భావన,లేడీస్ సర్కిల్ ఇండియా జాతీయ కార్యదర్శి శిషమ్ సబర్వాల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అవస్తి రేణుకాదేవికి ,పాఠశాలకు లాంఛనంగా బెంచీలను అందజేశారు.

రౌండ్‌టేబుల్‌ సుమన్‌ మాట్లాడుతూ డ్యూయల్‌ డెస్క్‌లు ప్రాథమిక అవసరమని, విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పిస్తాయన్నారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో పైకి రావాలని కోరారు. శిషామ్ సబర్వాల్ మాట్లాడుతూ పాఠశాలలో గడిపిన సమయం బలమైన పునాది వేస్తుంది. పునాది బలంగా ఉంటే భవిష్యత్తు కూడా బలంగా ఉంటుంది అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తాము ఎల్లవేళలా సిద్ధంగా, సుముఖంగా ఉన్నామని మమత తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలని, అభాగ్యులకు సహాయం చేయడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని అన్నారు

విద్యార్థులు డెస్క్‌ను చక్కగా ఉంచుకోవాలని, భావి విద్యార్థులకు అందించాలని, తద్వారా వారు కూడా వాటిని ఉపయోగించుకోవాలని భావన కోరారు. కష్టించి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని ఆమె చిన్నారులకు సూచించారు. పాఠశాలలో 130 మంది విద్యార్థులు ఐదవ తరగతి వరకు చదువుకుంటున్నారు.

పాఠశాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన సికింద్రాబాద్ రౌండ్ టేబుల్ 33 కి ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవి కృతజ్ఞతలు తెలిపారు. రెండు తరగతి గదులు నిర్మించాలని ఆమె కోరారు. అవి లేకపోవడంతో, కొన్ని తరగతి గదులు పరిపాలనా కార్యాలయాల నుండి నిర్వహించబడుతున్నాయన్నారు

Leave a Reply