పేద విద్యార్థినీలకు సీఎస్ఆర్ కింద 125 సైకిళ్లు, స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన ఆర్బీఎల్ బ్యాంక్..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, మార్చి10, 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్బీఎల్ బ్యాంక్, తమ సీఎస్ఆర్ ప్రోగ్రామ్ ఉమీద 1000లో భాగంగా 125 సైకిళ్లును హైదరాబాద్ లోని పేద విద్యార్థినీలకు అందించింది. ఆర్బీఎల్ బ్యాంక్ సీనియర్ ప్రతినిధుల సమక్షంలో అందజేశారు. జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కు సహాయం అందించాలని జిల్లా విద్యా శాఖాధికారులు ఎంపిక చేయడంతో శంషాబాద్ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ బిద్యార్థినీలకు సైకిళ్ళు, స్కూల్ కిట్స్ అందించారు.

పాఠశాల విద్యకు అధిక శాతం మంది చిన్నారులు దూరం అవుతుండటానికి అతి ముఖ్యవమైన కారణాలలో పాఠశాలలు తమ ఇంటికి దూరంగా ఉండటం ఒకటి. ఈ కార్యక్రమంతో అలాంటి విద్యార్థులకు అవసరమైన రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో పాటుగా విద్య వారికి మరింతగా చేరువవుతుంది.

ఈ సైకిల్స్ బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇవి ఇంధన సామర్ధ్యం. కలిగి ఉండటంతో పాటుగా పర్యావరణ అనుకూలంగానూ ఉంటాయి. ఆర్బీఎల్ బ్యాంక్, భారతదేశ వ్యాప్తంగా పలు నగరాలలో 1000 సైకిళ్లును పంపిణీ చేసింది. ఈ నగరాలలో హైదరాబాద్ తో పాటుగా రాయపూర్, చెన్నై, కొల్హాపూర్, గౌహతి, కోల్కతా, సిలిగురి, గోవా ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆర్.సుబ్రమణీయకుమార్ మాట్లాడుతూ ” కమ్యూనిటీ యాజ్ ద కాజ్’ అనే మా మిషన్ కు అనుగుణంగా, మా వినూత్నమైన సీఎస్ఆర్ ఔట్రీట్ కార్యక్రమాలతో పేద ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నాము”.

ప్రపంచ వ్యాప్తంగా, బాలికల ఉజ్వల భవిష్యత్ కు విద్య అత్యంత కీలకం, విద్యావకాశాలను చేరువ చేయడం ద్వారా బాలికలు తమ కలలను సాకారం చేసుకోకుండా నిరోధించే అవరోధాలను మనం తొలగించగలమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో గర్ల్ ఫౌండేషన్ ఫౌండర్, డైరెక్టర్, సోషల్ ఎంటర్ ప్రైన్యూర్, విద్యావేత్త, నటి, అందాల పోటీల విజేత రోహిణి నాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి పి. సుశీంద్రరావు, శంషాబాద్ మండల విద్యాధికారి రామ్ రెడ్డి, సోషల్ ఇంపాక్ట్, సోషల్ పాలసీ ప్రొఫెషనల్,ఫౌండర్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్స్ సురీ స్టీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply