మెగా ఆఫర్ దక్కించుకున్న రష్మిక…

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక...

మెగా స్టార్ చిరంజీవి -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి , సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది . ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి , మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ..

గడ్ ఫాదర్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి , అలానే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్సుమెంట్ చేస్తూ డైరెక్టర్ బాబీ పోస్టర్ రిలీజ్ చేశారు .. డైరెక్టర్ బాబీ తో మెగా స్టార్ చిరంజీవి సినిమా పూర్తి కాగానే , చిరు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ..టాలీవుడ్ లో చలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి .. భీష్మ సినిమా తరువాత డైరెక్టర్ వెంకీ కుడుముల ఏ సినిమా ఎనౌన్సుమెంట్ చేయలేదు , భీష్మ సినిమా తో డీసెంట్ హిట్ అందుకొన్న వెంకీ కుడుముల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఫైనల్ గా వెంకీ కుడుముల తన దగ్గర ఉన్న స్టోరీ తో మెగా స్టార్ చిరంజీవి కి వినిపించారు , ఈ స్టోరీ కి ఇంప్రెస్ అయినా మెగా స్టార్ , డైరెక్టర్ వెంకీ కుడుముల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ..

డైరెక్టర్ వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. వెంకీ కుడుముల – నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా చలో , ఈ సినిమాలో నాగశౌర్య సరసన – రష్మిక హీరోయిన్ గా నటించింది .. చలో సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు , అలానే వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమాలో సెకండ్ టైమ్ రష్మిక నే మల్లి రిపీట్ చేశారు ఈ యువ దర్శకుడు .. చిరంజీవి 150 వ సినిమా లో యంగ్ హీరోయిన్ కాజల్ ని సెలెక్ట్ చేశారు , ఆ తరువాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అనుష్క ,మరియు తమన్నా ని ఎంపిక చేసుకున్నారు , అలానే కొరటాల శివ చేస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ సెలెక్ట్ అయింది . ప్రస్తుతము ఈ యంగ్ డైరెక్టర్ మెగా స్టార్ చిరంజీవి తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి . మొత్తానికి వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్న వార్తల్లో నిజం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …