రామ్ , బోయపాటి కాంబోవాట్ ఏ ఎనర్జీ…

బోయపాటి డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ .. "

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు .. మొదటి సినిమా భద్ర దగ్గర నుంచి చివరి సినిమా వినయ విధేయ రామ సినిమా వరకు , అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను చూపిస్తారు .. బోయపాటి శ్రీను – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “వినయ విధేయ రామ” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిసాస్టర్ గా నిలిచింది .. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ అయిన తరువాత , రామ్ చరణ్ – బోయపాటి శ్రీను తో వినయ విధేయ రామ సినిమా చేసాడు , ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో మరో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది .. వినయ విధేయ రామ ప్లాప్ తో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఫిల్మ్ క్రిటిక్స్ నుండి చాలా విమర్శలు కూడా అందుకున్నారు ..

డైరెక్టర్ బోయపాటి శ్రీను ది – నందమూరి బాలకృష్ణ ది బెస్ట్ హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , మరియు లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ సినిమాలు గా నిలిచాయి .. వినయ విధేయ రామ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని నందమూరి బాలకృష్ణ తో హ్యాట్రిక్ కాంబినేషన్ గా అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు టీజర్ , లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద పోజిటివ్ బుజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. బోయపాటి శ్రీను అఖండ సినిమా తో ఎలా అయిన హిట్ కొట్టాలి అని ఎంతో కసిగా ఉన్నారు , ప్రస్తుతము బోయపాటి శ్రీను అఖండ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు .. అఖండ సినిమా తరువాత బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి , అయితే బోయపాటి శ్రీను అఖండ సినిమా తరువాత , మాస్ మహా రాజ్ రవి తేజ , మరియు అల్లు అర్జున్ కోసం స్టోరీస్ రెడీ చేసుకున్నారు .. బోయాపాటి శ్రీను – అల్లు అర్జున్ కి సరైనోడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు , మల్లి బన్నీ కి సరిపడే పవర్ ఫుల్ స్టోరీ ఉండటం తో , పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని వార్తలు వినిపించాయి .. ప్రస్తుతము అల్లు అర్జున ఫోకస్ అంతా పుష్ప సినిమా మీదనే , .. ఈ క్రమంలో బోయపాటి శ్రీను అఖండ సినిమా తరువాత తాను చేయపోయే నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది .. అఖండ సినిమా తరువాత బోయాపాటి శ్రీను – ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ,, ఇటీవలే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో రామ్ కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ మాస్ హిట్ అందుకుంది .. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తరువాత రామ్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు , ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన రిసల్ట్ తో వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెడుతున్నాడు , వాటిలో , తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ అదిరిపోయే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రామ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి . ఎనర్జిటిక్ హీరో రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అనగానే రామ్ అభిమానులు ఈ కాంబినేషన్ పక్కాగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు .. మొత్తానికి అఖండ సినిమా తరువాత , డైరెక్టర్ బోయపాటి శ్రీను , అల్లు అర్జున్ తో సినిమా ఫైనల్ అవుతుందా లేక ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా ఉంటుందా అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే కొద్దీ రోజులు ఆగాలిసిందే …