ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ ఎండీ డా.కె ఆనంద్‌ కుమార్‌ను సత్కరించిన పీఎస్‌జీ సన్స్‌ అండ్‌ చారిటీస్‌

పీఎస్‌జీ ఇనిస్టిట్యూషన్స్‌, కోయంబత్తూరు నడుపుతున్న చారిటబల్‌ ట్రస్ట్‌, పీఎస్‌జీ సన్స్‌ అండ్‌ చారిటీస్‌ , తమ ప్రశంసనీయ అలూమ్నిని తమ 97వ ఫౌండర్స్‌ డే వేడుకలలో భాగంగా గుర్తించింది.

హైదరాబాద్‌, గచ్చిబౌలి 27 జనవరి 2023 : పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (పీఎస్‌జీ సీఏఎస్‌) నుంచి విశిష్టమైన గుర్తింపు పొందిన తమ పూర్వ విద్యార్థులను పీఎస్‌జీ సన్స్‌ అండ్‌ చారిటీస్‌ గుర్తించి, సత్కరించింది. తమ 97వ ఫౌండర్స్‌ డే వేడుకలలో భాగంగా లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో అసాధారణ తోడ్పాటునందించడాన్ని గుర్తిస్తూ ఆసియాలో అతి పెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులలో ఒకటైన హెల్త్‌ కంపెనీ ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె ఆనంద్‌ కుమార్‌ను సత్కరించింది.

తన పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యలో ర్యాంక్‌ గ్రహీత అయిన డాక్టర్‌ కుమార్‌ , మైక్రోబయాలజీలో ఎంఎస్‌సీని (1986–1988)లో పూర్తి చేయడంతో పాటుగా జూవాలజీలో బీఎస్‌సీ (1983–1986) ని ఈ ఇనిస్టిట్యూట్‌ నుంచి పూర్తి చేశారు.

విభిన్న రంగాలకు ఆదర్శప్రాయమైన సహకారాన్ని అందిస్తున్న పీఎస్‌జీ పూర్వ విద్యార్థులలోని రత్నాలను ఇనిస్టిట్యూట్‌ ప్రశంసించింది. ఈ ఇనిస్టిట్యూట్‌లో విద్యను పూర్తి చేసిన తరువాత డాక్టర్‌ కె ఆనంద్‌ కుమార్‌ అంతర్జాతీయంగా పలు సంస్థలలో మేనేజీరియల్‌, పరిశోధనా సంబంధిత విధులను వ్యాక్సిన్‌/బయోటెక్‌ డొమైన్‌లలో నిర్వహించారు. ఆయన సేవలను అందించిన సంస్ధలలో ఫైజర్‌, స్కీరింగ్‌ ఫ్లౌ, వొకార్డ్‌ మొదలైనవి ఉన్నాయి. ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలలో కూడా విధులను నిర్వహించారు.

క్రమబద్దీకరణ, ఆధునీకరణ, వ్యాప్తి రంగాలలో తన సమర్థ నాయకత్వం మరియు వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో డాక్టర్‌ కె ఆనంద్‌ కుమార్‌ ప్రస్తుతం ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆసియాలో వ్యాక్సిన్‌ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్ధ ఇది. తమ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆర్‌ అండ్‌ డీ తో పాటుగా పలు తయారీ కేంద్రాలను సైతం విభిన్న ప్రాంతాలలో కలిగి ఉంది.

ఆయన నేతృత్వంలో మానవ ఆరోగ్యంతో పాటుగా జంతువుల ఆరోగ్యం కోసం పలు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసింది. కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ల కొరత అధిగంగా ఉండి, భారత ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్‌ అభ్యర్ధించిన మీదట, మహమ్మారి సమయంలో కొవిడ్‌ –19 వ్యాక్సిన్‌ల ఉత్పత్తిని గణనీయమైన వేగంతో పెంచేందుకు కుమార్‌ చేసిన కృషిని భారత ప్రభుత్వం ప్రశంసించింది.

ప్రిస్టిన్‌ బయోలాజికల్స్‌ న్యూజిలాండ్‌ లిమిటెడ్‌ని స్ధాపించడం ద్వారా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగించే కీలకమైన పదార్థం పరంగా దేశాన్ని సురక్షితం చేయడంలో ఆయన సహాయం చేశారు. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆరు సంవత్సరాల కాలంలో , ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ నికర విలువ నాలుగు రెట్లు పెరిగింది.

తనకు జరిగిన సత్కారం గురించి డాక్టర్‌ కె ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘ముందు చూపున్న సంస్ధ పీఎస్‌జీ. అక్కడ మైక్రో బయాలజీ కోర్సు చేయడం నా అదృష్టం. 1980లలో అది అత్యంత అరుదైన కోర్సు. ఈ స్కూల్‌ వాతావరణం, పీఎస్‌జీ వద్ద బోధన వంటివి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతుంటాయి.

ఓ నాయకునిగా అంతర్జాతీయ సంస్ధలకు నేతృత్వం వహించేలా నన్ను తీర్చిదిద్దడంలో ఈ ఇనిస్టిట్యూట్‌ పాత్ర అనన్య సామాన్యం. యువతకు నేను చెప్పేదేమిటంటే, తగినంతగా జ్ఞానం పెంపొందించుకోవాలి. విజయం సాధించాలంటే, నైతికత, విలువల పరంగా ఎన్నడూ రాజీపడకూడదు. ఇనిస్టిట్యూషన్‌లు ఎప్పుడూ కూడా సరికొత్త ఆలోచనలతో ఉద్భవించే ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించాలి.

అవసరాలను తీర్చడానికి మన ఉత్పత్తి, వినియోగం ఖచ్చితంగా పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉండాలి. విద్యార్థుల నడుమ స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పెంపొందించాలి. ఇది ఎన్నో ప్రయోజనాలను అందించడంతో పాటుగా లక్ష్యాలనూ నెరవేరుస్తుంది’’ అని అన్నారు.”

ఈ అవార్డును యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీ పూర్వ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ దినేష్‌ సింగ్‌ ; పీఎస్‌జీ అండ్‌ సన్స్‌ చారిటీస్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీ ఎల్‌ గోపాలకృష్ణన్‌ మరియు ఇతర అతిథుల సమక్షంలో కుమార్‌కు అందజేశారు.

Leave a Reply