రంజాన్‌ పండుగ వేడుకకు ఉచిత వసతి అందిస్తున్న అజ్మీర్‌లోని ఓయో హోటల్స్‌

OYO

తెలుగు సూపర్ న్యూస్,న్యూఢిల్లీ, 31 మార్చి 2023 : పవిత్రమైన రంజాన్‌ మాసం ఆచరించేవారికి తమ వంతు మద్దతు అందించడంలో భాగంగా, అజ్మీర్‌లోని రెండు ఓయో హోటల్స్‌ –హోటల్‌ వైభవ్‌,హోటల్‌ జెసీ ప్యాలెస్‌లు ఉచిత వసతి సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ స్కీమ్‌ను , అతి పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఖ్వాజా మొయినుద్దీన్‌ ఛిస్తీ దర్గా వద్ద మత పరమైన ప్రార్ధనలు చేసే వారికి సహాయపడేందుకు తీసుకువచ్చారు. ఈ హోటల్స్‌ నయా బజార్‌ వద్ద దర్గాకు అతి సమీపంలో ఉన్నాయి.

రంజాన్‌ తొలి రోజు ప్రారంభం నుంచి హోటల్‌ వైభవ్‌, హోటల్‌ జెసీ ప్యాలెస్‌లు ఉచిత వసతిని భక్తులకు అందిస్తున్నాయి. ఈ ఆఫర్‌ వినియోగించుకున్న యాత్రికులకు కాంప్లిమెంటరీగా ఇఫ్తార్‌ విందును కూడా అందిస్తున్నారు.

అతిథులు తమ వసతిని ఓయో యాప్‌ లేదా ఓయో వెబ్‌సైట్‌ లేదా హోటల్‌, రిజర్వేషన్‌ బృందంను సంప్రదించి బుక్‌ చేసుకోవడం లేదా మరింతగా ఈ ఆఫర్‌ గురించి తెలుసుకోవడం చేయవచ్చు,

ఈ స్కీమ్‌ గురించి మరింతగా హోటల్‌ వైభవ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య గోయల్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు, ప్రతిబింబం , ఇతరులకు సేవ చేయడానికి అత్యంత పవిత్రమైన మాసంగా రంజాన్‌ను భావిస్తుంటారు. సామాజిక బాధ్యత ను ప్రోత్సహించడంతో పాటుగా అవసరార్ధులకు సహాయపడటాన్ని సైతం ప్రోత్సహించాలని మేము నమ్ముతున్నాము. ఈ స్కీమ్‌తో, తమ ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక అనుభవాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము’’ అని అన్నారు.

OYO

హోటల్ వైభవ్ 2016 నుంచి కూడా రంజాన్ సమయంలో ఉచిత బసను అందిస్తూనే వేలాది మంది యాత్రికులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ఆతిథ్య వాతావరణంలో రంజాన్‌,అసలైన ఆనందాన్ని పొందడంలో సహాయపడుతుంది.

తన అనుభవాలను మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు జబ్బార్‌ మన్సూరి వెల్లడిస్తూ ‘‘సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన తమ అతిథులతో రంజాన్‌ స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా మద్దతు అందించేందుకు ఓయో హోటల్స్‌ చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆనందంగా ఉంది. ప్రశాంతంగా ఇక్కడ వసతి సౌకర్యాలు ఉండటం వల్ల తరావీహ్‌ ప్రార్ధనలలో పాల్గొనడంతో పాటుగా పవిత్రమైన ఖురాన్‌ పఠనం, ఇతర రంజాన్‌ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనగలిగాం’’ అని అన్నారు.

రంజాన్‌ సమయంలో భక్తులకు అతి ముఖ్యమైన కేంద్రంగా అజ్మీర్‌ వెలుగొందుతుంది. ఇక్కడ ఖ్వాజా మొయినుద్దీన్‌ ఛిస్తీ సమాధి ఉంది. అక్కడ భక్తులు ఆశీర్వాదం పొందడంతో పాటుగా పలు ఆచారాలనూ వ్యవహరిస్తారు. అలాగే పవిత్రమైన హోలీ మాసపు ఆధ్యాత్మిక వాతావరణ అనుభవాలనూ పొందుతారు. రంజాన్‌ సమయంలో, అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ ఛిస్తీ , దర్గా షరీష్‌కు ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తమ ప్రార్ధనలు చేయడం, ఆశీర్వాదం కోసం తరలివస్తారు.

Leave a Reply