తన ఎంజి కామెట్ ఈవీ (EV)-ది స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఆవిష్కరించిన ఎంజి మోటర్ ఇండియా

ఏప్రిల్, 26, 2023: MG మోటార్ ఇండియా, 99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్, భారతదేశంలో అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రకటిస్తూ తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం, ఎంజి కామెట్ ఈవీ(EV)ని నేడు ఆవిష్కరించింది. బహుముఖ జీఎస్ఈవీ-ప్లాట్‌ఫారమ్-ఆధారిత ప్యూర్ ఈవీ కొద్దిపాటి ఇంకా విశాలమైన డిజైన్‌తో నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణాన్ని అనుమతించే స్వాభావిక చురుకుదనాన్ని కలిగి ఉంది. కామెట్ ఈవీ అనేది ఎంజీ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో రెండవ ఈవీ, భవిష్యత్,వినియోగదారు-స్నేహపూర్వక స్మార్ట్ టెక్నాలజీలతో అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఈవీ- ఎంజీ కామెట్ ప్రత్యేక పరిచయ ధర రూ 7,98,000 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.

ఈ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ, “అర్బన్ మొబిలిటీ పరిణామంలో కీలక ఘట్టాన్ని సూచిస్తూ, భారతదేశంలో ఎంజీ కామెట్ ఈవీని విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. కామెట్ ఈవీ కేవలం కారు కన్నా ఎక్కువ; ఇది మన నగరాల్లో మనం ప్రయాణించే విధానాన్ని మార్చాలనే మా సంకల్పాన్ని సూచిస్తుంది’’ అని తెలిపారు.

‘‘కామెట్ ఈవీ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ జీఎస్‌ఈవీ (GSEV)ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించగా, ఇది ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ఈవీ విక్రయాల మార్కును చేరుకుంది. స్టైల్, టెక్నాలజీ,సుస్థిరతను కారు నాజూకుగా మిళితం చేస్తూ, అసమానమైన భద్రతా లక్షణాలతో బహుముఖ, విశాలమైన రైడ్‌ను అందిస్తుంది. ఎంజీలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ మరియు కనెక్ట్ చేయబడిందని మేము అర్థం చేసుకున్నాము. కామెట్ ఈవీతో స్టైల్ లేదా సౌలభ్యం విషయంలో రాజీ పడకుండా స్మార్ట్ ఎంపిక చేసుకునేలా మా వినియోగదారులను శక్తివంతం చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన వివరించారు.

స్మార్ట్ సేఫ్టీ

కామెట్ ఈవీ అన్ని అంశాలలో, లోపలి నుంచైనా లేదా బయటి నుంచైనా సురక్షితమైన, పటిష్టమైన వాహనం. ఇది 17.3 kWh లి-ఐయాన్ బ్యాటరీతో పాటు ప్రిస్మాటిక్ సెల్స్‌ను కలిగి ఉంటుంది. ఇది సుదీర్ఘ సైకిల్ లైఫ్ కోసం 39 కఠినమైన భద్రతా పరీక్షలకు లోనైంది. ఇది ఐపీ67-రేటెడ్‌తో నీరు,ధూళికి అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. వీటన్నింటితో ప్రతి పరిస్థితికి గరిష్ట భద్రతను నిర్ధారిస్తాయి. ఇది 17 హాట్ స్టాంపింగ్ ప్యానెల్‌లతో కూడిన హై స్ట్రెంత్ వెహికల్ బాడీ ఎంజీ కామెట్ ఈవీ మొత్తం నిర్మాణాన్ని బలంగా , సురక్షితంగా చేస్తుంది. స్మార్ట్ ఈవీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ +ఈబీడీ, ఫ్రంట్ & రియర్ 3 పాయింట్, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, టీపీఎంఎస్ (ఇన్‌డైరెక్ట్) మరియు ఐఎస్‌ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ వంటి సెగ్మెంట్-లీడింగ్ యాక్టివ్,పాసివ్ సేఫ్టీ ఫీచర్‌లతో లోడ్ చేయబడింది.

స్మార్ట్ టెక్

ఇంటెలిజెంట్ టెక్ డాష్‌బోర్డ్ విభాగంలో, ఎంజీ కామెట్ ఈవీ అధునాతనతను అందిస్తుంది. అంతర్నిర్మిత ఐస్మార్ట్ (iSmart)సిస్టమ్ 100+ వాయిస్ కమాండ్‌లు 55+ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో వస్తుంది. ఇది 10.25” హెడ్ యూనిట్,10.25” డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ ట్విన్ డిస్‌ప్లే వైడ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా వినోదం, కనెక్టివిటీ ఎంపికల శ్రేణికి వినియోగదారులకు అందించేందుకు వినోద వ్యవస్థ మూడు పూర్తిగా అనుకూలీకరించదగిన పేజీలతో కూడిన విడ్జెట్‌లతో అమర్చబడి ఉంటుంది. ఎంజీ కామెట్ ఈవీ మరో ప్రత్యేక లక్షణం స్మార్ట్ కీ. ఆకర్షణీయమైన, స్టైలిష్ డిజైన్ కామెట్ ఈవీకి అదనపు హంగును అందిస్తుంది. (డిజిటల్ కీ అనేది ఐ-స్మార్ట్‌కు చెందిన ఒక అంశం కాగా, ఇది స్మార్ట్ కీతో అనుబంధించబడలేదు).

స్మార్ట్ డిజైన్

ఎంజీ కామెట్ ఈవీ రూపకల్పన భవిష్యత్తు-టెక్ ప్రపంచాన్ని వ్యక్తపరుస్తుంది. బీఐసీఓ (BICO)-‘బిగ్ ఇన్‌సైడ్, కాంపాక్ట్ అవుట్‌సైడ్’ అనే కాన్సెప్ట్‌ ఆధారంగా తయారు చేసిన కామెట్ ఈవీ సౌకర్యవంతంగా విశాలమైన, మెరుగైన లెగ్‌రూమ్‌తో పాటు హెడ్‌రూమ్‌ను అందిస్తుంది. కర్వ్‌డ్ టెక్ బాడీ లైన్ బయటి నుంచి కామెట్ ఈవీ ఏరోడైనమిక్,స్టైలిష్ అంశాలను ప్రత్యేకంగా చూపిస్తుంది. కామెట్ ఈవీ సైడ్లు ఫ్లోటింగ్ మోటిఫ్‌తో ఫ్యూచరిస్టిక్ రియర్-వ్యూ మిర్రర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. రెండవ వరుసలోని ఏరో-క్రాఫ్ట్ క్యాబిన్ విండో కామెట్ ఈవీలో అదనపు విజిబిలిటీని అందిస్తుంది.

ఎంజీ కామెట్ ఈవీ రెండవ వరుస సీట్లలో 50:50 సెట్టింగ్‌లతో 4-సీటర్ కాన్ఫిగరేషన్‌తో సౌకర్యవంతమైన,రూమి క్యాబిన్‌ను కలిగి ఉంది. ఆధునిక-శైలి క్యాబిన్ స్పేస్ ఈ ఆధునిక పట్టణ ఈవీ సౌలభ్యం,ఇంటరాక్టివ్ అంశాలకు మద్దతుగా అనేక ఫంక్షన్లతో స్మార్ట్ టెక్నాలజీ కాన్ఫిగరేషన్‌లతో కలిపి ఉంది. కామెట్ ఈవీ మల్టీ-ఫంక్షన్ ,ప్రత్యేకంగా రూపొందించబడిన స్టీరింగ్ తెలివైన టెక్ ,ఫ్యూచరిస్టిక్ పాడ్-లాంటి నియంత్రణలతో కలిపి వస్తుంది. ఈవీ ఈవీకి ఆధునిక గాడ్జెట్ లాంటి అనుభూతిని అందిస్తుంది. రోటరీ గేర్ సెలెక్టర్ అనేది క్రోమ్ రింగ్‌లు, ప్రత్యేకమైన నమూనాలతో అలంకరించబడిన భవిష్యత్ రోటరీ నాబ్‌తో కూడిన ట్రాన్స్‌మిషన్ ఆపరేషన్ అని చెప్పవచ్చు. అదనంగా, సెంటర్ కన్సోల్‌లో ఎలక్ట్రిక్ విండో ఆపరేషన్ బటన్‌లు 12-వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ ఎలక్ట్రిక్ ప్యాకేజీ వంటి ఉపయోగకరమైన ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి.

కామెట్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 230 కి.మీ. వరకు సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. యుక్తిగా నడపడం సులభం, పార్క్ చేయడం సులభం, ఛార్జ్ చేయడం సులభం జేబులో, పర్యావరణంపై సులభంగా ఉండటం వంటి ఆచరణాత్మక అంశాలతో, కామెట్ ఈవీ ఒక కచ్చితమైన సెగ్మెంట్ సృష్టికర్త మాత్రమే కాకుండా పట్టణ ప్రయాణికులకు ముఖ్యమైన మరియు  భారతదేశంలో ఈవీ ఔత్సాహికులకు సమయానుకూలమైన ఆఫర్‌గా కూడా ఉంది.

స్మార్ట్ ఛాయిస్

అదనంగా, ఎంజీ కామెట్ ఈవీ రెండు ప్రత్యేక ఎడిషన్‌లను కూడా ప్రవేశపెట్టింది- గేమర్ ఎడిషన్, ఎల్‌ఐటీ ఎడిషన్ – తరువాతి తరం పట్టణ ప్రయాణికుల-గేమింగ్ మరియు టెక్ కమ్యూనిటీలు,ఫ్యాషన్‌వాదుల వ్యక్తిత్వాలకు అనుగుణంగా దీన్ని తయారు చేశారు.

ఎంజీ కామెట్ ఈవీ 250+ డెకాల్ ఎంపికలు, గ్రాఫిక్స్ మొదలైన వాటితో సహా అనేక పర్సనలైజ్ ఎంపికలతో వస్తుంది. దాని విభిన్న రకాలైన జెన్ జీ వినియోగదారుల కోసం స్మార్ట్ ఈవీ ఆహ్లాదకరమైన, సాంకేతిక వైబ్‌ని అనుసంధానం చేస్తుంది.

స్మార్ట్ సేవింగ్స్

అర్బన్-యువ ప్రయాణీకులకు, పొదుపు నిజంగా ముఖ్యమైన అంశం. కామెట్ ఈవీ 1,000 కి.మీ.కు రూ.519 చొప్పున ప్రోత్సాహకరమైన , సాధికారత కలిగిన ఛార్జింగ్ ఖర్చును అందిస్తుందని ఎంజీ అంచనా వేసింది**.

** ఆయా పవర్ టారిఫ్‌ల ప్రకారం గణాంకాలు మారవచ్చు

Leave a Reply