ఉస్మానియా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 15, 2022: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిపుణ, సేవా ఇంటర్నేషనల్ ఎన్జీవోల ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 17 వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 250కి పైగా కంపెనీల ప్రతినిధి బృందం పాల్గొంటుందని, దీని ద్వారా దాదాపు 20,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని నిర్వాహకులు వెల్లడించారు.
లక్షా యాభై వేల మందికి పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని… ఈ జాబ్ మేళాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొంటారని వారు తెలిపారు. ఐటీ రంగంలో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల, ఆర్ట్స్ కళాశాలలో ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ వంటి నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని వారు తెలిపారు.

ఉస్మానియా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ ఆర్గనైజేషన్, ఏబీవీ ఫౌండేషన్, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, ఐఎఫ్ఐఎన్ గ్లోబల్, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్, దేవికీ ఫౌండేషన్, రైజ్ ఫౌండేషన్, జేడీ ఫౌండేషన్ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో ఎక్స్‌పర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు సుభద్రారాణి, సేవా ఇంటర్నేషనల్ సభ్యులు, హెచ్‌సీడీసీ ఓయూ డైరెక్టర్ స్టీవెన్ సన్, టీడీఎఫ్ యూఎస్‌ఏ సభ్యుడు అరుణ్‌కుమార్, ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ వ్యవస్థాపకులు హరికృష్ణ, ఐఎఫ్‌ఐఎన్ గ్లోబల్‌కు చెందిన శేషాద్రి వనజల, నిపుణులు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హర్ష, కార్తీక్ పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు.