ద–మలాంగ్ హ్యునర్ మహోత్సవ్‌ను ప్రారంభించిన మలాంగియా
తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, 10 ఏప్రిల్ 2023: భారతదేశపు చేతిపనులు (క్రాఫ్ట్స్), వంటకాలు (క్యుసిన్) సంస్కృతి (కల్చర్) పండుగ – ‘ద–మలాంగ్ హ్యునార్ మహోత్సవ్’ ను సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ప్రారంభించింది. ఈ ఫెస్టివల్‌ను కళాకారులు/చేతిపనివారల కోసం నిలకడైన ప్లాట్‌ఫామ్‌ను అందించడంతో పాటుగా వారి పనితనానికి ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా చేసుకుని నిర్వహించారు.
ఈ ఫెస్టివల్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఏప్రిల్ 10,2023 సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా మలాంగియా ఆర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రిషి కుమార్ ఝా మాట్లాడుతూ ‘‘హ్యునార్ మహోత్సవ్‌లో 250కు పైగా కళాకారులు, చేతిపని వారులు భారతదేశం నుంచి 20కు పైగా దేశాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రలలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఢిల్లీ,గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఒడిషా, పుదుశ్చేరి, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ వారు తమ సున్నితమైన, దేశీయ హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులను విక్రయించనున్నారు’’ అని అన్నారు.
సున్నితమైన స్వదేశీ తయారీ ఉత్పత్తులలో అప్లిక్ వర్క్, డ్రై ఫ్లవర్స్, జ్యూట్ కేన్, బ్రాస్ ఉత్పత్తులు, ఉడెన్, క్లేటాయ్స్, అర్జక్ బ్లాక్ ప్రింట్, బ్లూ ప్రింట్‌పాటరీ, పాష్మినా షాల్, లక్క గాజులు, రాజస్తానీ ఆభరణాలు, ఫుల్కారీ, లెదర్ ఉత్పత్తులు, పాటరీ ,జ్యూట్ ఉత్పత్తులు వంటివి విక్రయాలకు అందుబాటులో ఉంటాయి. దేశంలోని ప్రతి ప్రాంతపు రుచులనూ సందర్శకులు ఆస్వాదించవచ్చు. విభిన్నమైన సంస్కృతి, సంగీత కార్యక్రమాలను సైతం వీరు ఆస్వాదించవచ్చు. అల్తాఫ్ రాజా, భూమిక మాలిక్, అంకిత పాఠక్, అనిల్ భట్, ఖుషి మొదలైన వారితో పాటుగా హైదరాబాద్ స్థానిక కళాకారులు ఈ ప్రదర్శనలివ్వనున్నారు.
‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తిని ఈ కార్యక్రమం ప్రదర్శించడంతో పాటుగా కళాకారులు తమ వినూత్నత చూపేందుకు ఓ భారీ వేదికను సైతం అందిస్తుంది.