జక్కన్న మాస్టర్ ప్లాన్… మహేష్ బాబు ఫాన్స్ కి గుడ్ న్యూస్…

డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ , ఎన్టీఆర్ తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కించారు .. ఈ కాంబినేషన్ , అలానే పేట్రియాటిక్ స్టోరీ కావడంతో , ఈ మూవీ పై ప్రేక్షకుల్లో హై ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి .. ఇక డైరెక్టర్ రాజమౌళి తొలిసారిగా ఒక ఫిక్షన్ స్టోరీని తీసుకొని తన ఊహ ను జ్యోడించి ఈ సినిమాను భారీ కాస్టింగ్ తో తెరకెక్కించారు .. రాజమౌలి సినిమా అంటేనే ఒక పెద్ద విజువల్ గ్రాండియర్ , సెట్స్ , గ్రాఫిక్స్ , మరియు ఎమోషన్ , యాక్షన్ ఎలిమెంట్స్ , సెంటిమెంట్స్ ఇలా అన్ని కలిసి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది .. ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ , సెంటిమెంట్ సీన్స్ రాజమౌళి టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది ..ఇక ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు .. ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. వీరిద్దరి కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. మహేష్ బాబు కోసం విజేంద్రప్రసాద్ ఒక యాక్షన్ ఎడ్వెంచర్ స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు వచ్చాయి .

మహేష్ బాబు కి స్టోరీ రాయాలి అంటే చాలా కష్టం అని విజయేంద్రప్రసాద్ తెలిపారు , మహేష్ బాబు సినిమా కోసం నిర్మాత కే.ఎల్‌.నారాయణ కూడా సిద్ధంగా ఉన్నారు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే .. రాజమౌళి టేకింగ్ కు ఎవరు ఫిదా అవ్వలిసిందే .. రాజమౌళి సినిమాల్లో ఉండే కామన్ పాయింట్ ఎమోషన్ విత్ యాక్షన్ .. మహేష్ బాబు సినిమాలు కనుక చూసినట్లు అయితే , షార్ట్ డైలాగ్స్ , ఇంటెన్స్ యాక్టింగ్ , ఫైట్స్ , కామిడీ టైమింగ్ ఇలా మహేష్ మార్క్ ఉంటాయి .. ఇక రాజమౌళి మూవీ అంటే మహేష్ బాబు మేకోవర్ అవ్వలిసిందే ……. మహేశ్‌ను రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తారు ? స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి సోషల్ మీడియా చాలా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది … ఈ మూవీ సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో జేమ్స్‌ బాండ్‌ తరహా కథతో ఈ సినిమా రూపొందనుందని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిపై జక్కన్న టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. ఈ మూవీ గురించి మరొక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది .. రాజమౌళి- మహేశ్‌తో సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌తో సినిమా అంటేనే కథ పక్కాగా ఉండాలి. అందుకే ప్రీ ప్రొడక్షన్‌కు సుమారు 7 నెలల సమయం పట్టొచ్చు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ను పట్టాలెక్కిద్దామనుకుంటున్నాను’ అని తెలుస్తుంది .. . ఇక మహేశ్‌ ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు .. ఈ , మూవీ పూర్తయిన తర్వాతనే రాజమౌళి సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. .. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న జక్కన్న .. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని మహేష్ బాబు ప్రాజెక్ట్ మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టనున్నాడు , అయితే రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ గురించి రోజురోజుకు ఏదోఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది .. ఈ మూవీ కి సంబంధించి , అసలు స్టోరీ ఏమిటి ? , కాస్టింగ్ ఎవరు ? ఎంత బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే ….