అత్తాపూర్‌లో కొత్త షోరూమ్ ను ప్రారంభించిన కమల్‌వాచ్ కో.. అతిధులుగా హాజరైన మన్నారా చోప్రా, రితిక చక్రవర్తి, కష్రాఫ్

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, నవంబర్ 19,2022: ప్రముఖ వాచ్ కంపెనీ కమల్ వాచ్ కో అత్యున్నత , నాణ్యత కలిగిన టైమ్ పీసెస్‌ను ఎంచుకోవడంలో నగరవాసులకు సహాయపడుతుంది. దాదాపు 5వేలకు పైగా విభిన్న మోడల్స్ డిస్‌ప్లే కలిగిన కలిగిన కమల్ వాచ్ కో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వాచ్ డీలర్లలో ఒకటిగా వెలుగొందుతుంది.

లగ్జరీ వాచ్‌ల కొనుగోలు, మరమ్మత్తు సేవలను అందిస్తున్న సంస్ధ తమ 47 వ షోరూమ్‌ను అత్తాపూర్‌లో ప్రారంభించింది. ఈ షోరూమ్ ప్రారంభోత్సవంలో నటులు మన్నారా చోప్రా, రితిక చక్రవర్తి, కష్రాఫ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో 1969లో కుటుంబ వ్యాపారంగా తమ కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ, ఖచ్చితత్త్వం, మెరుగైన సేవల ద్వారా నగర వాసులను ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 46 షోరూమ్‌లు సంస్ధకు ఉన్నాయి.
దాదాపు అర్ధ శతాబ్దపు అనుభవం కలిగిన నిపుణులు వాచ్‌ల ఎంపికలో వినియోగదారులకు ఇక్కడ సహాయపడగలరు. అన్ని స్థాయిల్లోనూ నమ్మకం, మెరుగైన సేవల ద్వారా వినియోగదారులకు సేవలనందిస్తూ మహోన్నతమైన అనుభవాలను అందిస్తుంది.

కమల్ వాచ్ కంపెనీ దాదాపు 70కు పైగా ప్రతిష్టాత్మక వాచ్ బ్రాండ్‌లకు నిలయంగా ఉంది. ప్రీమియం స్విస్ టైమ్ పీస్‌లు, వింటేజ్ ఎనలాగ్ వాచ్‌లు, సమకాలీన డిజిటల్ వాచ్‌లు , విప్లవాత్మక స్మార్ట్‌వాచ్‌లకు నిలయం కమల్ వాచ్ కో. ఇక్కడ రోలెక్స్, ఒమెగా, రాడో, లాంజిన్స్, టాగ్ హ్యుర్, టిస్సో, సీకో, అర్మానీ ఎక్సేంజ్, మైఖేల్ కోర్స్, ఫోసిల్, ఎంపొరియో అర్మానీ, టామీ హిల్‌ఫిగర్ మొదలైన బ్రాండ్ల వాచ్‌లు ఇక్కడ లభ్యమవుతాయి. ప్రతి వాచ్ బ్రాండ్ వారెంటీతో పాటుగా కమల్ వాచ్ కంపెనీ భరోసాతో వస్తుంది.