హలో వాల్ ఫినీషెస్ కోసం నూతన ఉత్పత్తి ప్రారంభించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్
తెలుగు సూపర్ న్యూస్,25 ఏప్రిల్ 2023 : భారతదేశంలో పర్యావరణ అనుకూల రంగుల కంపెనీ,22 బిలియన్ డాలర్ల జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌లో భాగమైన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్ తమ విలాసవంతమైన శ్రేణి హలో వాల్ ఫినీషెస్ కోసం నూతన ఉత్పత్తి ప్రచారాన్ని ప్రారంభించింది.
వివేకవంతులైన భారతీయ వినియోగదారులు, తమ గోడలు కనిపించే విధానం పట్ల అత్యంత ఆప్రమప్తంగా ఉంటున్నారు. అయితే, ఎంపిక దగ్గరకు వచ్చేసరికి వారు తాము కొనుగోలు చేసేది అత్యుత్తమమంటూ గుడ్డిగా కొనుగోలు చేస్తుంటారు. చాలాసార్లు అయితే అది ఎందుకు ఉత్తమం అనేది కూడా తెలియదు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు వారు ప్రయోజనాలు పొందితే, చాలాసార్లు మాత్రం ఆ ప్రయోజనాలను కోల్పోతుంటారు. జెఎస్‌డబ్ల్యు ఇప్పుడు వినియోగదారులను సమాచారయుక్త ఎంపిక చేసుకోమని ప్రోత్సహిస్తుంది. ఇది ఇప్పుడు సవాలియా ప్రశ్నలతో ‘రంగుకు ఎందుకు అధికంగా చెల్లించాలి’ అని అడుగుతుంది.
ఈప్రచారంలో, సవాలియా వినియోగదారులను తాము ఉత్తమమనుకుంటున్న రంగులలో అన్ని ప్రయోజనాలనూ పొందుతున్నారా అని ప్రశ్నిస్తుంది. జెఎస్‌డబ్ల్యు పెయింట్స్ హలో శ్రేణి ఫినీషెస్ తమ శ్రేణిలో ఉత్తమంగా ఉండటంతో పాటుగా పూర్తి శ్రేణి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ స్టెయిన్ (దీని వల్ల గోడలను శుభ్రపరచడం అత్యంత సులభం), జెర్మ్ బ్లాక్ (బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ల నుంచి ఇంటి ఇంటీరియర్స్‌ను కాపాడుతుంది), అత్యున్నత ప్రకాశం, అత్యుత్తమ శ్రేణి కవరేజీ, రంగు ఏదైనా ఒకటే ధరతో వస్తాయి. అదనంగా, ఇది వాటర్ బేస్ కావడంతో పాటుగా వీఓసీ అతి తక్కువగా ఉండటం వల్ల పూర్తిగా విష రహితంగా, కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. టీబీడబ్ల్యుఏ నేపథ్యీకరించిన ఈ ప్రచారంలో బాలీవుడ్ సూపర్‌స్టార్లు అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా కనిపించనున్నారు. ఈ టీవీసీని ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో అన్ని ప్రధాన ఛానెల్స్‌లో ప్రసారం చేయనున్నారు.
జెఎస్‌డబ్ల్యు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్–సీఈఓ సుందరేశన్ మాట్లాడుతూ ‘‘ భావితరపు పెయింట్ కంపెనీని నిర్మిస్తున్న వేళ, మా వినియోగదారులకు సమాచారయుక్త ఎంపిక అవకాశాలను తీసుకోవడంలో సహాయపడుతున్నాము. ఈ ప్రచారం ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, వినియోగదారులు తరచుగా తాము ఏది పొందుతున్నారో తెలియకుండానే గుడ్డిగా వెళ్లిపోతుంటారు. సవాలియా, ఒక రెచ్చగొట్టే ఏజెంట్, వినియోగదారులను సరైన ప్రశ్నలను అడుగుతూ వారిని సరైన ఎంపిక చేసుకోమని ప్రోత్సహిస్తాడు! ఈ ప్రచారం ద్వారా వీక్షకులకు ఒకే పెయింట్ బ్రాండ్‌లో అన్నీ లభిస్తాయని తెలుపుతున్నాము. అయితే , ఈ ప్రయోజనాలను పొందడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రశ్నించడం అని తెలుపుతుంది’’అని అన్నారు.
టీబీడబ్ల్యుఏ ఇండియా గోవింద్ పాండే మాట్లాడుతూ ‘‘ ఈ విభాగంలో వినియోగదారులు సాధారణంగా గుడ్డిగా కొనుగోళ్లు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. వారు తమ కొనుగోళ్లను తమ అంచనాలు లేదంటే గత వినియోగ అనుభవాలను కొనసాగించడం చేస్తారు. జెఎస్‌డబ్ల్యు పెయింట్స్ ఆవిష్కరణలు విస్తృత శ్రేణి రంగులను విస్తృత శ్రేణి ప్రయోజనాలతో అందిస్తాయి. జెఎస్‌డబ్ల్యు పెయింట్స్ హలో ప్రచారం ద్వారా భారతీయ వినియోగదారులను ఆప్రమప్తం చేయడంతో పాటుగా తమ రంగుల ద్వారా మరింతగా ప్రశ్నించడంతో పొందవచ్చని తెలుపుతున్నాము’’ అని అన్నారు.