125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి స్టీలు స‌ర‌ఫ‌రా చేసిన జిందాల్ స్టెయిన్‌లెస్‌

Jindal Stainless

తెలుగు సూపర్ న్యూస్,హైద‌రాబాద్‌, ఏప్రిల్ 18, 2023: న‌గ‌రంలో ఇటీవ‌ల ఆవిష్క‌రించిన 125 అడుగుల ఎత్తున్న డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన 300కు పైగా మెట్రిక్ ట‌న్నుల స్టెయిన్‌లెస్ స్టీలును జిందాల్ స్టెయిన్‌లెస్ స‌ర‌ఫ‌రా చేసింది.

ఈ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్‌లో కొత్త‌గా నిర్మిస్తున్న స‌చివాల‌య భ‌వ‌నం వెనుక‌వైపు నిర్మించి, ఇటీవ‌లే డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర‌భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. అంబేడ్క‌ర్ మ‌న‌వ‌డు ప్ర‌కాష్ అంబేడ్క‌ర్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

Jindal Stainless

12-32 మిల్లీమీట‌ర్ల మందం ఉన్న 304 గ్రేడు హాట్ రోల్డ్ స్టెయిన్‌లెస్ స్టీలును జిందాల్ స్టెయిన్‌లెస్
స‌ర‌ఫ‌రా చేసింది. విగ్రహం ఆర్మేచర్ నిర్మాణంలో స్టెయిన్‌లెస్ స్టీలును ఉపయోగించారు. ఈ ప్రాజెక్టు కోసం
2022 మార్చి- జూన్ మధ్య కాలంలో స్టెయిన్‌లెస్ స్టీలును సరఫరా చేశారు.

ఈ సందర్భంగా జిందాల్ మేనేజింగ్ డైరెక్టర్ అభ్యుదయ్ జిందాల్ మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ఐకానిక్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని
రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన దార్శనికుడు అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మన దేశానికి
గర్వకారణం” అన్నారు.

అందుకే 50 అడుగుల ఎత్తైన పీఠంపై 172 అడుగుల గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ తో విగ్రహాన్ని నిర్మించారు. దీనికి
అనుబంధ భవనం, మ్యూజియం, అంబేడ్కర్ జీవితకాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ప్రదర్శించే
గ్యాలరీ కూడా ఉంటాయి.

Leave a Reply