హైదరాబాద్ స్టోర్‌లో హస్తకళ గొప్ప వేడుకను నిర్వహించిన జైపోర్ బిజినెస్..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్; నవంబర్ 6, 2023: భారతదేశ హస్తకళ ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్న జైపోర్ ఈరోజు ఇటీవ ల ప్రారంభించిన హైదరాబాద్ స్టోర్‌లో హస్తకళ గొప్ప వేడుకను నిర్వహించింది.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్‌కి చెందిన ఫ్లాగ్‌షిప్ ఆర్టిసానల్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ అయిన జైపోర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. జైపోర్ బిజినెస్ హెడ్ రష్మీ శుక్లా, హైదరాబాద్ బిజినెస్ సర్కిల్ లో ప్రముఖు రాలు, వ్యాపారవేత్త, ఆంత్రప్రెన్యూర్, దాత, ఫ్యాషన్ మరియు కళను ఆరాధించే సుధారెడ్డి ఈ కార్యక్రమాన్నికి కో- హోస్ట్స్ గా వ్యవహరించారు.

ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ విభిన్న హస్తకళా సంప్రదాయాల యొక్క గొప్పదనాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్త సంప్రదాయ, సమకాలీన చేతిపనుల సౌందర్య వైవిధ్యం, కళాత్మకతను ప్రదర్శించిం ది.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్, జైపోర్ బిజినెస్ హెడ్ శ్రీమతి రష్మీ శుక్లా ఈ సందర్భంగా మాట్లాడు తూ, ‘‘భారత దేశ గొప్ప హస్తకళా వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రచారం చేయడంలో జైపోర్ ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉంది. ఈ వేడుక దేశవ్యాప్తంగా హస్తకళాకారుల సమాజం పట్ల మా అచంచలమైన అంకితభావానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం హస్తకళాకారులు, క్రాఫ్ట్ అంటే ఇష్టపడేవారు, డిజైన్ ఔత్సాహికులను ఏ కం చేసింది. భారతీయ హస్తకళ సున్నితమైన రంగంలో తమను తాము లీనం చేసుకోడానికి వారికి ఒక ప్రత్యే కమైన వేదికను అందించింది’’ అని అన్నారు

.

ఆమె ఇంకా మాట్లాడుతూ, ‘‘మా జూబ్లీ హిల్స్ స్టోర్ కేవలం భౌతిక రిటైల్ స్థలం మాత్రమే కాదు, భారతీయ హస్త కళ సారాంశానికి నివాళి. హైదరాబాదు సంస్కృతిని జైపోర్ యొక్క అత్యద్భుతంగా రూపొందించిన ఉత్పత్తుల తో సజావుగా మిళితం చేయడం ద్వారా, ఈ స్టోర్ స్థానికులకు, సందర్శకులకు ఆకట్టుకునే అసాధారణ షాపిం గ్ అనుభవాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.

కలంకారి, అజ్రఖ్, చందేరి, బెనారసి వంటి కళారూపాలను, దుస్తుల సేకరణలలో మరిన్నింటిని కలిగి ఉన్న ఈ స్టోర్ హస్తకళలు, సంస్కృతిని ఇష్టపడేవారికి స్వర్గధామం. హోమ్ విభాగం ఇతర అంశాలతో పాటుగా సున్నితమైన సిరామిక్స్, ఇత్తడి ప్రభావాలిస్, కాన్సా సర్వ్ వేర్, బ్లాక్-ప్రింటెడ్ సాఫ్ట్ లినెన్‌లను ప్రదర్శిస్తుంది. అదనంగా, ఈ స్టోర్ గిరిజన వెండి ఆభరణాలు, కుందం జ్యుయలరీ, దేవాలయ ఆభరణాల ఎంపికను ప్రదర్శిస్తుం ది. అన్నీ శతాబ్దాల

నాటి సంప్రదాయాల నుండి ప్రేరణ పొందాయి, కాలాతీత సౌందర్యాన్ని ఇవి వెదజల్లు తున్నాయి.

Leave a Reply