ఇసుజు మోటార్స్ ఇండీయా భారతదేశములో ‘ఇసుజు ఐ-కేర్ ‘సమ్మర్ క్యాంప్’ ను విడుదల చేసింది

తెలుగు సూపర్ న్యూస్,చెన్నై, 17 మార్చి 2023:ఉత్తమ సేవ,యజమాని అనుభవాన్ని అందించుటకు ఇసుజు నిబద్ధతను తిరిగి ధృవీకరించే తన నిరంతర ప్రయత్నములో, ఇసుజు మొటార్స్ ఇండీయా తన ఇసుజు డి-మ్యాక్స్ పిక్-అప్స్, ఎస్‎యూవీల శ్రేణి వాహనముల కొరకు ఒక దేశ-వ్యాప్త ‘ఇసుజు ఐ-కేర్ ‘సమ్మర్ క్యాంప్’ ను నిర్వహించబోతోంది. వినియోగదారులకు అద్భుతమైన ప్రయోజనాలను, దేశములో ఈ వేసవిలో సమస్యా-రహితమైన డ్రైవింగ్ అనుభవము కొరకు ప్రెవెంటివ్ మెయింటెనెన్స్ చెకప్స్ అందించాలనేది ఈ సర్వీస్ క్యాంప్ ఉద్దేశము.

‘ఇసుజు కేర్’ , ప్రయత్నములో భాగంగా 2023 మార్చ్ 22 నుండి 29 వరకు అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్లెట్స్ లో సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ సమయములో, వినియోగదారులు తమ వాహనాలపై ప్రత్యేక ఆఫర్స్ & ప్రయోజనాలను కూడా అందుకోవచ్చు.

క్యాంప్ కు వచ్చే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలను అందుకుంటారు: –

  • ఉచిత 37-పాయింట్ సమగ్ర చెక్-అప్
  • లేబర్* పై 10% డిస్కౌంట్
  • స్పేర్ పార్ట్స్* పై 5% డిస్కౌంట్
  • ల్యూబ్స్ & ఫ్లూయిడ్స్* పై 5% డిస్కౌంట్
  • రీటెయిల్ ఆర్‎ఎస్‎ఏ కొనుగోలు* పై 10% డొస్కౌంట్
  • ఉచిత టాప్ వాష్
  • ఉచిత ‘రీజెన్’** గమనిక- షరతులు వర్తిస్తాయి”. * కేవలం బిఎస్VI వాహనములకు మాత్రమే.

సమ్మర్ క్యాంప్ అహ్మదాబాద్, బారాముల్లా, బెంగళూరు, భీమవరం, భుజ్, కాలికట్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, డిమాపూర్, గాంధిధాం, గోరఖ్పూర్, గురుగ్రాం, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జలంధర్, జమ్ము, జోధ్పూర్, కొచ్చి, కోల్కత్తా, కర్నూల్, లక్నౌ, మధురై, మంగళూరు, మెహసాన, మొహాలి, ముంబై, నాగపూర్, నెల్లూరు, పూణె, రాయ్పూర్, రాజమండ్రి, రాజకోట్, సిలిగురి, సూరత్, తిరుపతి, త్రివేండ్రం, వడోదరా, విజయవాడ,విశాఖపట్టణం లో ఉన్న ఇసుజు అన్ని అధీకృత సర్వీస్ సదుపాయాలలో నిర్వహించబడుతుంది.

వినియోగదారులు సర్వీస్ బుకింగ్ కొరకు సమీప ఇసుజు డీలర్ అవుట్లెట్ కు కాల్ చేయవచ్చు లేదా https://isuzu.in/service-booking/ ను సందర్శించవచ్చు. మరింత సమాచారము కొరకు వినియోగదరులు 1800 4199 188 (టోల్-ఫ్రీ) నంబరుకు కాల్ చేయవచ్చు

· 22 నుండి 29 మార్చ్, 2023 వరకు ఈ అద్భుతమైన సర్వీస్ ప్రయోజనాలను వినియోగదారులు అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్లెట్స్ వద్ద అందుకోవచ్చు.

Leave a Reply