8.16 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతి ఆర్డర్లను పొందిన ఐఎఫ్ఎల్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 26, 2023: అన్ని రకాల పేపర్లు, స్టేషనరీ వస్తువుల వ్యాపారంలో అగ్రగామి సంస్థ అయిన ఐఎఫ్ఎల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్..కెన్యా కంపెనీ ఫ్రెరీనా హోల్డింగ్ లిమిటెడ్ నుంచి ఎగుమతి ఆర్డర్లు పొందింది. కెన్యాలోని పాఠశాలలకు రాత పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, బాండ్ పేపర్లు, కాపీ పేపర్లను సరఫరా చేసేందుకు ఈ ఆర్డ‌ర్ వ‌చ్చింది. ఆర్డర్ మొత్తం ఎఫ్ఓబి విలువ 8.16 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 67 కోట్లు) ఉంటుందని అంచనా. ఒక సంవత్సరంలోపు ఈ మొత్తం స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుంది.


విదేశీ భాగస్వామితో కంపెనీ తగిన కసరత్తు పూర్తిచేసింది. ఎగుమతి ఎగుమతులు 2023 జూన్ నుంచి మొద‌లై.. మార్చి 2024 నాటికి పూర్తవ్వాలి. ఒప్పందంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం 80% ముందుగా చెల్లించి, ఆర్డర్ డెలివరీ చేసిన
త‌ర్వాత‌ మిగిలిన 20% చెల్లిస్తారు. 21 ఏప్రిల్ 2023 న ఐఎఫ్ఎల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు ఇచ్చిన ఉత్తర్వులను ధ్రువీకరిస్తూ ఫ్రెరీనా హోల్డింగ్ లిమిటెడ్ తన లేఖలో.. రాత పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, బాండ్ పేపర్, కాపీ పేపర్లను సరఫరా చేయడానికి కెన్యా ప్రభుత్వం త‌మ కంపెనీకి ఆర్డ‌ర్ అప్పగించిందని, ఆ ఆర్డ‌ర్‌నే ఇప్పుడు ఐఎఫ్ఎల్ ఎంటర్ ప్రైజెస్
లిమిటెడ్ కు ఇచ్చామ‌ని పేర్కొంది.


ఈ సందర్భంగా ఐఎఫ్ఎల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఎఫ్ఓ డోలార్ షా మాట్లాడుతూ “2023-24 ఆర్థిక సంవత్సరంలో అందించాల్సిన 8.16 మిలియన్ డాలర్ల విలువైన ప్రతిష్ఠాత్మక ఆర్డర్‌ను మా కంపెనీ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. అంగీకరించిన నిబంధనల ప్రకారం ఈ ఆర్డర్‌లో 80% మొత్తాన్ని ముందుగా చెల్లిస్తారు. 2023 జూన్ నుంచి
ఎగుమతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిరంతరం నాణ్యమైన సేవలను అందిస్తూనే వాటాదారులందరికీ విశేష‌మైన‌ విలువను సృష్టించేలా కంపెనీ తన వృద్ధి వ్యూహాన్ని అమలు చేయడానికి కృషి చేస్తోంది. రానున్న సంవత్సరాల్లో కంపెనీ మరింత బలపడుతుంది, వేగవంతమైన వృద్ధిని సాధిస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

2009లో స్థాపించిన ఐఎఫ్ఎల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ప్రముఖ పేపర్ ట్రేడింగ్ కంపెనీ. ఇది అన్ని రకాల పేపర్ సంబంధిత ఉత్ప‌త్తుల‌ను కలిగి ఉన్న విభిన్న శ్రేణిని అందిస్తుంది. వాటిలో రాత కాగితాలు, కోటెడ్ పేపర్, ఎ/4
పేపర్, హై బ్రైట్, కాపీయ‌ర్ పేపర్, డ్యూప్లెక్స్ బోర్డ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేపర్, నోట్ బుక్స్ మొదలైనవి ఉన్నాయి.
“ఆలోచనాపూర్వ‌క‌మైన‌ నాయకత్వం, యాజమాన్యపు లోతైన ఇన్‌సైట్ వ‌ల్లే కంపెనీ కొత్త అవకాశాలను కనుగొంటూ, దాని నిజమైన సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయగ‌లుగుతోంది. అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాల ఆధారంగా కంపెనీ
విలువ, నిబద్ధతను అందిస్తూనే ఉంది. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది” అని షా అన్నారు.

2023 ఏప్రిల్ 24న జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో కంపెనీ ప్రస్తుత వాటాదారులకు పూర్తిగా చెల్లించిన బోనస్ షేర్లుగా ఒక్కోటి రూ.1 విలువైన‌ 4.54 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. లిక్విడిటీని పెంచడానికి కంపెనీ 1:4 నిష్పత్తిలో బోనస్ ఇష్యూను ప్రకటించింది (ప్రతి నాలుగు ఈక్విటీ షేర్లకు ఒక పూర్తిగా చెల్లించే ఈక్విటీ షేరు) మరియు స్టాక్‌ను 1: 10
నిష్పత్తిలో (రూ.10 ముఖ విలువ కలిగిన ఒక ఈక్విటీ షేరును రూ.1 ముఖ విలువ కలిగిన 10 ఈక్విటీ షేర్లుగా) విభజించింది. ఈ కార్పొరేట్ చర్యల ప్రయోజనాలను పొందడానికి వాటాదారుల అర్హతను నిర్ణయించడానికి 2023 ఏప్రిల్ 21ను
రికార్డు తేదీగా నిర్ణయించింది.

Leave a Reply