నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు గ్రీనరీ అవార్డు

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 24,2023: తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 15తేదీన హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్స్ లో జరిగిన 7వ గార్డెన్ ఫెస్టివల్ అండ్ ఫస్ట్ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్-2023లో పాఠశాలల విభాగంలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మొదటి బహుమతిని దక్కించుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వ్యవసాయశాఖమంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గతంలో అనేక అవార్డులను అందుకుంది.
IGBC ప్లాటినం అవార్డు కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యానవన శాఖ గతంలో కూడా రెండేళ్లపాటు వరుసగా హరితహారం అవార్డులతో డీపీఎస్‌ని సత్కరించిందని ఈ అవార్డులన్నీ మా డీపీఎస్ చైర్మన్ ఎం.కొమరయ్య అన్నారు.

లీడ్ మోటివేటర్ సీనియర్ ప్రిన్సిపాల్, ఆర్ అండ్ ఆర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సునీత రావు మాట్లాడుతూ “పచ్చదనాన్నిపెంచడానికి విద్యార్థులను, సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో తమ వంతు కృషి చేయాలని వారిని ప్రోత్సహించడం ద్వారా క్యాంపస్‌లో ,చుట్టుపక్కల వారితో పాటు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహిస్తున్నామని” తెలిపారు.

“హరితహారం కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం స్కూల్ యాజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వందలాది మొక్కలను విరాళంగా అందజేస్తుంది. క్యాంపస్‌లో బర్త్‌డే గార్డెన్, హెర్బల్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్, టైర్ గార్డెన్ మొదలైన తోటలు కూడా ఉన్నాయి. ప్రతి గార్డెన్ నిర్దిష్ట ఎజెండాతో నిర్వహిస్తోంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్.

“అంతేకాకుండా విద్యార్థులు వారి పుట్టినరోజున బర్త్‌డే గార్డెన్ కోసం మొక్కలు విరాళంగా ఇవ్వమని ప్రోత్సహిస్తారు.హెర్బల్ గార్డెన్ లో వివిధ రకాల మూలికా మొక్కలను ఏర్పాటుచేశారు.
పాఠశాల చేపట్టిన హరిత కార్యక్రమాలన్నింటిని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు మా పాఠశాలను ఎంపిక చేయడం ద్వారా గుర్తించిందని”డీపీఎస్ చైర్మన్ ఎం.కొమరయ్య పేర్కొన్నారు.

Leave a Reply