బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో బండి సంజయ్ కి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ నాయకులు..

తెలుగు సూపర్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు5, 2023: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొదటిసారిగా తెలంగాణ గడ్డపై అడుగు పెట్టిన “కరీంనగర్ ఎంపి, బడుగు బలహీనవర్గాల నాయకుడు బండి సంజయ్ కి ఘన స్వాగతం లభించింది.

అడుగడుగునా ఆయనకు పూలవర్షంతో వేలది కార్యకర్తలు డప్పుదరువుల కోలాహలల మధ్య ఏ నాయుడుకి లేనివిధంగా అత్యంత ఘనంగా వెల్ కమ్ చెప్పారు.

శంషాబాద్ పట్టణంలో శంషాబాద్ మండల, మున్సిపల్ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బండి సంజయ్ కు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి విజయ ఖడ్గాన్ని బహూకరించి శంషాబాద్ డా బి.ఆర్. అంబెడ్కర్ విగ్రహం వద్ద భారీ గజమాలతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ స్వాగతం పలికారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రమేకాకుండా, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూడా కాషాయ జెండాను ఎగురవేయడం ఖాయం అని బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల జయ జయ ధ్వనులతో అడుగడుగునా బండి సంజయ్ కి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో బిజెపి కార్యవర్గ సభ్యులు ప్రేమ్ రాజ్ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి, నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, శంషాబాద్ మండల పట్టణ అధ్యక్షులు చిటికెల వెంకటయ్య, కొనమోల దేవేందర్, శంషాబాడ్ మండల పట్టణ బిజెపి పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply