“మిస్టర్ కళ్యాణ్” సినిమాకు మంచి ఆదరణ…

"Mr. Kalyan"

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్ 17 మార్చి 2023:శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. మార్చి 10న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది.

సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 10న విడుదలైన మిస్టర్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మంచి సినిమాను చూసిన అనుభూతిని పొందామని ప్రేక్షకుల చెప్పడం విశేషం. అమ్మాయిలు, మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా వారికి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

మంచి కంటెంట్ తో వస్తే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుందని మిస్టర్ కళ్యాణ్ సినిమా నిరూపించింది. నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చెయ్యాలని దర్శకుడు పండు మరో సక్సెస్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.

Leave a Reply