అత్తాపూర్‌లో ఎస్సేనుషియా సెలూన్ లాంజ్

ఫిబ్రవరి15,2024,హైద‌రాబాద్‌: హైద‌రాబాదీల‌కు స‌రికొత్త అనుభూతిని అందించేందుకు విలాస‌వంత‌మైన సెలూన్ అత్తాపూర్ లో ఎంట్రీ ఇచ్చేసిందని టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్ అన్నారు అంత‌ర్జాతీయ బ్రాండ్‌ల‌తో అందం, వ్య‌క్తిగ‌త సౌంద‌ర్యం, కేశ సంర‌క్ష‌ణలో సేవ‌లు అందించేందుకు ఎస్సెనుషీయా (ESSENTIA) సెలూన్ లాంజ్ అత్తాపూర్‌లో ఈనెల 16వ తేదీన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు ఇక్క‌డ హెయిర్ క‌టింగ్, స్టైలింగ్, క‌ల‌రింగ్, ఫేషియ‌ల్, చేతులను, పాదాల‌ను అందంగా తీర్చిదిద్దే ప‌ద్ద‌తి, స్కిన్ కేర్.. ఇలాంటి స‌ర్వీసులు స్త్రీ, పురుషుల‌కు అందిస్తున్నారు. అని ఆయన అన్నారు.

కొత్త టెక్నాల‌జీతో కూడిన‌ సెలూన్ ఇంటీరియ‌లర్‌లు, అధునాత‌న సీటింగ్, ఇటాలియ‌ను థీమ్ వంటివి క‌స్ట‌మ‌ర్‌ల‌కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు సెలూన్లో నెయిల్ టెన్ష‌న్స్, జెల్ పాలిష్, రిఫిల్స్ వంటి అనేక సేవ‌ల‌ను అందిస్తున్నారు. స్నేహ‌పూర్వ‌క‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డంలో ఎస్సెనుషియా సిబ్బంది ముందుంటార‌ని ఎస్సెనుషియా యజమానురాలు శ్రీమతి స్వాతిరెడ్డి చెప్పారు.. కాఫీ లేదా జ్యూస్ తాగుతూ, ఆహ్లాద‌క‌ర‌మైన సంగీతం వింటూ ఎస్సెనుషియా స‌ర్వీసులు అందుకునే అవ‌కాశం ఇక్క‌డ మాత్ర‌మే లభిస్తుందని వర్ధమాన నటుడు సోహెల్ అన్నారు సాధారణంగా మగవాళ్ళు అందానికి ప్రాధాన్యం ఇవ్వరు కానీ త‌మ‌ సెలూన్ ను సందర్శించిన వాళ్ళు మరో పది మందికి చెప్పేలా త‌మ‌ సేవలుంటాయని చెప్పారు.

చిన్నచిన్న లోపాలు కూడా బయటకి కనిపించకుండా చేసేందుకు హెయిర్ బ్రష్, హెచ్‌డీ మేకప్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు అని సినీ టీవీ నటి సునీత అన్నారు స్పెష‌ల్ మేక‌ప్‌తో పెండ్లికూతురును అందాల రాణిగా తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. గోళ్లకు మెరుగులు, మీ గోళ్ల అందాన్ని ఇనుమడింపజేసేందుకు పెయింట్, డెకొరేట్ వంటి నెయిల్ ఆర్ట్ సేవలు ఇక్కడ లభిస్తున్నాయని ఆమె తెలిపారు.

Leave a Reply