భారతదేశంలో అత్యాధునిక ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన డీఎస్‌ఎం

DSM inaugurates state

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 11,2023:ఆరోగ్య, పౌష్టికాహారంలో అంతర్జాతీయంగా లక్ష్యిత, శాస్త్ర ఆధారిత సంస్థ రాయల్‌ డీఎస్‌ఎం, నూతన ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌ వద్ద ప్రారంభించింది. దేశవ్యాప్తంగా, విస్తృత శ్రేణిలో ఈ ప్రాంత వాసుల పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకు తగిన మద్దతును ఈ కేంద్రం ద్వారా అందించనుంది.

ఇది మొట్టమొదటి, వినూత్న తరహా వాణిజ్య తయారీ కేంద్రం. ఇది అత్యాధునిక సాంకేతికతను,అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తి ప్రక్రియలను వినియోగించుకుని న్యూట్రిషినల్లీ ఫోర్టిఫైడ్‌ (పోషక విలువలతో కూడిన) బియ్యం గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్‌ ఐఎస్‌ఓ 22000: 2018 ప్రమాణాలు కలిగి ఉంటుంది. సంవత్సరానికి 3600 టన్నుల కెన్నల్స్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా చేసుకుంది.

అధిక శాతం భారతీయ రాష్ట్రాలలో ప్రధాన ఆహారంగా వరి నిలుస్తుంది. కానీ సంప్రదాయ మిల్లింగ్‌ ప్రక్రియలో తెల్ల బియ్యంగా మార్చే ప్రక్రియలో పోషకాలతో కూడిన బ్రాన్‌ లేయర్స్‌ (ఊక పొరలు) తొలిగిస్తారు. అందువల్ల, దీనిలో సూక్ష్మపోషకాలు పెద్దగా లభించవు. లాన్సెట్‌లో 2022లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, భారతదేశంలో పౌషకాహార లోపం అతి సాధారణం.

యువత నుంచి మధ్య వయసు వ్యక్తుల వరకూ భారతీయులలో అధిక శాతం మంది తమ పూర్తి సామర్థ్యం ప్రదర్శించలేకపోతున్నారు. ఇక పెద్ద వయసు వారైతే ప్రమాదకరమైన నాడీ సంబంధిత సమస్యల ప్రమాదం ఎదుర్కొంటున్నారు. ఈ తరహా హిడెన్‌ హంగర్‌ సమస్యలను నివారించే అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటిగా ఫుడ్‌ ఫోర్టిఫికేషన్‌ పరిగణించబడుతుంది. హిడెన్‌ హంగర్‌ అనేది శాస్త్రీయంగా అనారోగ్యానికి దోహదం చేస్తుందని, ప్రజల ఆర్ధిక అవకాశాలు,సంక్షేమంపై శాశ్వత దుష్పరిణామాలకు సైతం దారితీస్తుందని గుర్తించబడింది.

డీఎస్‌ఎం,వినూత్నమైన సాంకేతికత విటమిన్స్‌,మినరల్స్‌ను విరిగిన బియ్యంతో మిళితం చేయడంతో పాటుగా సురక్షితంగా వీటిని హాట్‌ ఎక్స్‌ట్రూజన్‌ ప్రక్రియతో లాక్‌ ఇన్‌ చేసి నూతన రైస్‌ కెర్నల్స్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ పూర్తి ఆటోమేటెడ్‌ సాంకేతికత, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సూచించిన మోతాదును ఖచ్చితంగా అందించడంతో పాటుగా మోతాదుకు తక్కువ లేదంటే ఎక్కువ అనే సమస్యను నివారిస్తుంది. ఈ విధానం కారణంగా సూక్ష్మ జీవుల వల్ల బియ్యం కలుషితం కాదనే భరోసా అందిస్తూ , స్వచ్ఛతనూ నిర్ధారిస్తుంది. ఈ ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ను అతి సులభంగా ముడి బియ్యంతో మిళితమవుతుంది. ఇది సాధారణ బియ్యం లాగానే ఉండటంతో పాటుగా ఉడకడం,రుచిని కూడా అందిస్తుంది. ఆరోగ్య అభిలాషులకు ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా నిలువడంతో పాటుగా తమ ఆహార అలవాట్లు మార్చుకోకుండా ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వినూత్న విధానంగానూ నిలుస్తుంది.

డీఎస్‌ఎం హెల్త్‌ న్యూట్రిషన్‌ అండ్‌ కేర్‌ డైరెక్టర్‌–సౌత్‌ ఆసియా ఆనంద్‌ దివాన్జీ మాట్లాడుతూ ‘‘ఆహార పోషక నాణ్యత మెరుగుపరచడంలో డీఎస్‌ఎం ప్రపంచ ప్రసిద్ధి చెందిన నైపుణ్యాన్ని తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇది ఎంతోమంది ప్రజల ఆరోగ్యంపై అసాధారణ ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆదాయ వర్గాల ప్రజలలోనూ దాగిన ఆకలి సవాళ్లను పరిష్కరించడంలో మా కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఇది ఉంటుంది. భారత ప్రభుత్వ ఆరోగ్య లక్ష్యాలకు మద్దతునూ అందిస్తుంది. ఈ ఉత్పత్తి సౌకర్యం భవిష్యత్‌లో నాణ్యమైన ఫోర్టిఫికేషన్‌ పద్ధతుల కోసం నూతన ప్రమాణాలను ఏర్పరచగలదని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

భారతదేశంతో పాటుగా దక్షిణాసియా ప్రాంత అవసరాలను హైదరాబాద్‌ ప్లాంట్‌ తీర్చగలదని డీఎస్‌ఎం అంచనా వేస్తుంది. ఈ ప్రాంతాలలో ప్రధాన ఆహారంగా వరి కనిపిస్తుంది. ఈ ప్లాంట్‌ జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో పాటుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను అనుసరిస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే నీరు, ఆవిరి ఐఎస్‌ 10500 సర్టిఫికేషన్‌ అందుకున్నాయి.

Leave a Reply