హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించనున్న దజోన్‌

* స్పోర్ట్స్ స్ట్రీమింగ్ టెక్నాలజీ ప్లేపై దృష్టి సారించనున్న టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

* లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ కు రూ.200 కోట్ల పెట్టుబడి

* డిసెంబర్ 2023 నాటికి వెయ్యి మంది, డిసెంబర్ 2024 నాటికి 2500 మందికి ఉపాధి

తెలుగు సూపర్ న్యూస్, హైద‌రాబాద్, మే 26, 2023: ప్రముఖ గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ దజోన్‌ (https://www.dazn.com/en-IN/home),  హైదరాబాద్‌లో త‌న‌ ప్రధాన టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. స్పోర్ట్స్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ పై దృష్టి సారించిన సీఓఈ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది.

హైదరాబాద్‌లో  రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టి 2023 డిసెంబర్ నాటికి వెయ్యి మందిని నియ‌మించుకోవాలని దజోన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ఈ అత్యాధునిక సంస్థ కార్యాల‌యంలో ఇప్పటికే 350 మందికి పైగా పనిచేస్తున్నారు. 2024 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్యను 2500కు పెంచనున్నారు.

ఈ సందర్భంగా దజోన్‌ గ్రూప్ సీఈఓ షే సెగెవ్ మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో టెక్నాలజీ సీఓఈని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఇది అందించే అదనపు సాంకేతిక సామర్థ్యం.. అత్యున్న‌త స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌గా మార‌డంలో మా రోడ్ మ్యాప్‌ను మ‌రింత వేగవంతం చేస్తుంది. మా డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటుకు ఎంత‌గానో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి.. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావుకు, అంకితభావం కలిగిన అధికారుల బృందానికి ధన్యవాదాలు” అని చెప్పారు.

టెక్నాల‌జీ సీఓఈ గురించి దజోన్‌ గ్రూపు చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ సందీప్ టికు మాట్లాడుతూ, “అధునాతన స్ట్రీమింగ్ టెక్నాలజీల ఆవిర్భావం; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), వేరబుల్ టెక్నాలజీతో క్రీడాభిమానులు ఇంత‌కు ముందు ఎప్పుడూ చ‌విచూడ‌ని స‌రికొత్త అనుభ‌వాన్ని వారికి అందించే సామ‌ర్థ్యం మా సంస్థ‌కు ఉంది.

హైదరాబాద్‌లో, భారతదేశం అంతటా అద్భుతమైన సాంకేతిక సామ‌ర్థ్యం ఉన్న ఉద్యోగులు క‌లిసి దజోన్‌ కు హై క్వాలిటీ స్ట్రీమింగ్, అద్భుత‌మైన ఫ్యాన్ ఎంగేజిమెంటును అందించ‌డానికి స‌హాయ‌ప‌డ‌తారు”  అన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని అరబిందో గెలాక్సీలో జరిగిన కార్యాలయ ప్రారంభోత్సవంలో హైదరాబాద్ లోని దజోన్‌ గ్రూప్ కు చెందిన 350 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి దజోన్‌ లోగో, టౌన్ హాల్ ను ఆవిష్కరించారు.

Leave a Reply