పట్టువదలని పూరీ – అన్నయ్య తో సినిమా గ్యారెంటీ …

చిరు తో సినిమా తగ్గేదే లేదంటున్న పూరి...

              

2007 లో మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన సినిమా శంకర్ దాదా జిందాబాద్ . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ అందుకుంది . శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు .. మెగాస్టార్ చిరంజీవి సుమారు 10 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఖైదీ no 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు . అన్నయ 150 వ సినిమా కోసం చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు , చాలా లాంగ్ గ్యాప్ తరువాత అన్నయ్య రీ ఎంట్రీ ఇస్తుండటం , మరియు 150 వ సినిమా కాబట్టి మెగా స్టార్ తన 150 వ సినిమా కోసం చాలా స్టోరీస్ విన్నారు , చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు , చిరంజీవి 150 వ సినిమా కాబట్టి , మొదటగా ఈ ఆఫర్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు అవకాశం వచ్చింది , అయితే డైరెక్టర్ పూరీ దగ్గర స్క్రిప్ట్ లేదు జస్ట్ “ఆటో జానీ ” అన్న ఒక్క టైటిల్ ఒక్కటే ఉంది , ఈ టైటిల్ ను మెగా స్టార్ కోసం డైరెక్టర్ పూరీ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు .. మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా కోసం డైరెక్టర్ పూరీ ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసి నేరేషన్ కూడా ఇచ్చారు , కానీ మెగా స్టార్ చిరంజీవికి ఫస్ట్ ఆఫ్ నచ్చింది కానీ సెకండ్ ఆఫ్ , మరియు క్లైమాక్స్ నచ్చకపోవడంతో పూరీ ఆఫర్ మిస్ అయింది ..

డైరెక్టర్ పూరీ మిస్ చేసుకున్నాకా ,ఈ ఛాన్స్ డైరెక్టర్ వి వి వినాయక్ కు లభించింది , మెగాస్టార్ చిరంజీవి ది – డైరెక్టర్ వి .వి వినాయక్ ది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది , మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు .. మెగా స్టార్ చిరంజీవికి ఈ సినిమా 150 వ సినిమా కావడం విశేషం , ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు ..ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ సఫీస్ దగ్గర బిగెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నర్సింహా రెడ్డి సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు ఈ నేపథ్యంలో కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా , మరియు మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ , మరియు డైరెక్టర్ మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి .. మెగా స్టార్ చిరంజీవి 154 వ సినిమా డైరెక్టర్ బాబీ తో ఎనౌన్సమెంట్ చేశారు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్య క్రమాల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరు అయ్యారు . ఈ క్రమంలో మల్లి డైరెక్టర్ పూరి తో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో త్వరలో , సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. పూరి జగన్నాథ్ కు మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చెయ్యాలని బలంగా ఉంది .. ప్రస్తుతము మెగా స్టార్ చేతిలో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , అలానే డైరెక్టర్ పూరి చేతిలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ఉంది . మరి మొత్తానికి డైరెక్టర్ పూరి లైగర్ సినిమా పూర్తి అయిన తరువాత , గాని మరొక సినిమా ఎనౌన్సుమెంట్ చెయ్యరు , అలానే మెగా స్టార్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది , చిరంజీవి కోసం డైరెక్టర్ మారుతి కూడా ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి , డైరెక్టర్ పూరి కి గత కొంత కాలంగా బలమైన హిట్స్ లేవు పోకిరి , టెంపర్ లాంటి హిట్స్ తప్ప మరి ఏ సినిమాలు ఆశించినంత హిట్స్ అందుకోలేదు , ప్రస్తుతము పూరి ఫోకస్ అంతా విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా మీదనే ఉంది , అయితే తాజాగా పూరి -మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియా లో హల్ చల్ అవుతుంది .. చిరంజీవి 154వ సినిమా ఓపెనింగ్ రోజు పూజా కార్యక్రమాల్లోడైరెక్టర్ పూరి కనిపించారు. ఆయన ప్రత్యేక గెస్ట్ గా హాజరై ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేసారు. అక్కడికి పూరితో పాటు చాలా మంది దర్శకులు వచ్చారు. కానీ పూరి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గానే హైలైట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆటోజానీని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. మెగాస్టార్ తో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ పూరి కి వస్తే మరొక అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఖాయం .. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి , మొత్తానికి పూరి – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సీనిమా కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు , ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే …