ఆచార్య సినిమా నుండి మెగా అభిమానులకు గుడ్ న్యూస్…

సిద్ద టీజర్ ను రిలీజ్ చేస్తున్న కొరటాల టీమ్...


    

మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్యా అనే సినిమాలో నటిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకొని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చేస్తుండటం , అలానే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ , మరియు రామ్ చరణ్ స్పెషల్ రోల్ లో నటించడం , ఇలా ఒక్కో ఇంట్రస్టింగ్ న్యూస్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. కొరటాల శివ – ఈ సినిమా మేకింగ్ విషయంలో , ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .

ఇప్పటికే ఈ సినిమా లో చిరంజీవి లుక్ విషయంలో అభిమానుల దగ్గర నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. అలానే ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ రోల్ కు సంబంధించి , మెగా స్టార్ – రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సినిమా లో రామ్ చరణ్ తో పాటు పూజా హెగ్డే కూడా నటిస్తున్నది , ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ రిలీజ్ అయింది , ఈ సాంగ్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది . తాజాగా రామ్ చరణ్ టీజర్ ఎప్పుడు రాబోతున్నది అనే విషయం సోషల్ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. అలానే రామ్ చరణ్ చేస్తున్న సిద్ద క్యారెక్టర్ గురించి టీజర్ ఎప్పుడు రాబోతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు .. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఆచార్య సినిమా నుండి ఇంతకు ముందు విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా నుంచి త్వరలోనే నిర్మాతలు ఓ అదిరిపోయే ఎనౌన్సమెంట్ రిలీజ్ చేస్తున్నారు .. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ టీజర్ త్వరలో నే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ కొరటాల టీమ్ అంతా సిద్ధం చేసుకుంటున్నారు .. ఇటీవల చెర్రీ, పూజల నీలాంబరి పాటను విడుదల చేయగా.. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . అయితే ఈ సారి రామ్ చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ ను త్వరలోనే విడుదల చేస్తారని తెలుస్తుంది …