2022 కాలెండర్ నాదే అంటున్న మెగాస్టార్ చిరంజీవి…

ఫుల్ స్వింగ్ లో ఉన్న మెగాస్టార్...    

మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్యా అనే సినిమాలో నటిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకొని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. . .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు , ఆచార్య సినిమా తరువాత మోహన్ రాజా డైరెక్షన్ లో గడ్ ఫాదర్ , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ , బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి …

మెగా స్టార్ చిరంజీవి యంగ్ హీరోస్ తో సమానంగా పోటీ పడి తమ సినిమాలు ఎనౌన్సమెంట్ చేయడం అభిమానులకు ఎంతో సంతోషంగా ఉంది .. గతంలో మెగా స్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ కృష్ణ , ఒకే సారి మూడు నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొనే వారు , ఇప్పుడు అదే పద్దతి ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. ఈ నేపథ్యంలో 2022 లో నాలుగు సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి ..ఆచార్య సినిమా ను ఫిబ్రవరిలో నెల లో రిలీజ్ చేయనున్నారు .ఆచార్య సినిమా తరువాత గాడ్ ఫాదర్ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు ..గాడ్ ఫాదర్ సినిమా తరువాత భోళాశంకర్, మరియు బాబి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని కూడా అదే స్పీడ్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ..ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ మెగా స్టార్ చిరంజీవి , డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో సినిమా కమిట్ అయ్యారు .. అలానే డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా , ఇలా మొత్తంగా 2022 లో మెగా స్టార్ చిరంజీవి కాలెండర్ ఫుల్ డేట్స్ లాక్ అయినట్లు తెలుస్తుంది …