“చే” సినిమా పోస్టర్ ను ఆవిష్కరించిన చేగువేరా కుమార్తె

తెలుగు సూపర్ న్యూస్,ఆగష్టు19,2023: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతోంది. ఈ చిత్రానికి “చే” అని పేరు ఖరారు చేశారు. లాంగ్ లైవ్ అనే ట్యాగ్ లైన్ తో దీనిని రూపొందిస్తున్నారు. క్యూబా తరువాత ప్రపంచం లో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది.

నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు..

అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ… “విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం” అని చెప్పారు.

“ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తికాగానే…త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు.

నటీనటులు లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్…
నిర్మాతలు : సూర్య , బాబు , దేవేంద్ర
కో డైరెక్టర్ : నాని బాబు
రచయిత, దర్శకుడు : బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్ : నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్ : వివ రెడ్డి పోస్టర్స్
డి.ఓ.పి : జగదీష్
ఎడిటర్ : శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్.

Leave a Reply