రోగులకు అందుబాటు ధరలలో మెరుగైన వైద్య సేవలనందించేందుకు ఫైబ్ తో భాగస్వామ్యం చేసుకున్న కేర్ హాస్పిటల్స్
తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్,మే 5,2023: భారతదేశంలో సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లో ఒకటికావడంతో పాటుగా, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేర్ హాస్పిటల్స్, సుప్రసిద్ధ కన్స్యూమర్‌లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఫైబ్‌తో భాగస్వామ్యం చేసుకుని జీరో కాస్ట్ ఈఎంఐను 10 లక్షల రూపాయల వరకూ ఎంపిక చేసిన ,ఎంపిక చేయని చికిత్సలన్నింటికీ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ఈఎంఐ సదుపాయం ప్రస్తుతం హైదరాబాద్, భుబనేశ్వర్‌లలో కేర్ హాస్పిటల్స్ వద్ద లభ్యమవుతుంది. త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా ఇతర కేంద్రాలలో కూడా లభ్యం కానుంది.
ఎన్నో సంవత్సరాలుగా, నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో సుప్రసిద్ధమైనది కేర్ హాస్పిటల్స్. హైదరాబాద్‌తో పాటుగా మెట్రోయేతర నగరాలలో విస్తృత శ్రేణిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది అత్యంత అందుబాటుధరలో, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అధిక శాతం ప్రజలకు అందిస్తుంది. కేర్ హాస్పిటల్స్ మరియు ఫైబ్ నడుమ ఈ భాగస్వామ్యం ఆరోగ్య సంరక్షణ పరంగా ఉన్న అంతరాలను అధిగమించడంలో తోడ్పడనుంది. ఎందుకంటే, భారతదేశంలో ఇప్పటికీ 80% మంది ఆరోగ్య సంరక్షణ సేవలను తమ జేబులో నుంచే చెల్లిస్తున్నారు అని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) అధ్యయనం వెల్లడిస్తుంది. ఈ భాగస్వామ్యం, రోగులు మరియు కేర్ గివర్స్ కు వైద్య ఖర్చులను భరించడంలో తగిన సహాయం చేయగలదు.
ఈ ప్రకటన గురించి కేర్ హాస్పిటల్స్, గ్రూప్ సీఎఫ్‌ఓ వికాస్ రస్తోగి మాట్లాడుతూ ‘‘ఫైబ్‌తో మా భాగస్వామ్యం రోగులు మరియు వారి కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల ఎదురయ్యే ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు సహాయపడనుంది. ప్రతి ఒక్కరికీ అత్యున్నత నాణ్యత కలిగిన వైద్య సంరక్షణను అందించాలన్నది కేర్ హాస్పిటల్ లక్ష్యం. అదే సమయంలో ఫైబ్, అవసరమైన సమయంలో మెరుగైన ఆర్థిక సేవలను అందిస్తుంది. సంయుక్తంగా, మేము అందుబాటు ధరల్లోని అంతరాలను పూరించడంతో పాటుగా రోగులు మరియు కేర్‌గివర్స్‌కు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణలను అందించనుంది’’ అని అన్నారు.
కేర్ హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం గురించి ఫైబ్ కో–ఫౌండర్, సీఈఓ అక్షయ్ మెహరోత్రా మాట్లాడుతూ ‘‘వైద్య అత్యవసరాలను తీర్చుకోవడానికి ఆధారపడతగిన ఆర్ధిక పరిష్కారాలు లేని వ్యక్తులకు అత్యుత్తమ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలను ఈ ఉత్పత్తి అందించనుంది. రోగులు తక్షణ అనుమతులు పొందడంతో పాటుగా ఒక నిమిషం కంటే తక్కువలోనే తమ అప్లికేషన్‌లను పూరించుకోవచ్చు. ఇది రోగులకు ఆర్ధిక భారమనే బాధ లేకుండా ముందుగా చికిత్స ప్రారంభించుకోవడమూ వీలవుతుంది’’ అని అన్నారు.
ఈ సదుపాయం నగదు భీమా రోగులిరువురికీ అత్యవసర వైద్య ఖర్చుల వేళ లభ్యమవుతుంది. ఈ మొత్తాలను నిర్ధేశిత చికిత్సలకు మాత్రమే వినియోగించాలనే షరతులేవీ లేవు. ఈ సదుపాయం పొందడం కోసం రోగులు మరియు కేర్ గివర్లు తప్పనిసరిగా భారతీయులు కావడంతో పాటుగా 21 నుంచి 55 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అంతేకాకుండా వారి కనీస జీతం 15 వేల రూపాయలు ఉండాలి. ఈ మొత్తం ప్రక్రియ నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది. కేవలం పాన్ కార్డు మరియు కెవైసీ వివరాలు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్స్ ఉంటే చాలు.