ఒక్క రోజు ముందుగానే ఓటీటీ లో బీమ్లా నాయక్ రిలీజ్ —

Pawan kalyan

పవర్ స్టార్ స్టామినా చూపించిన భీమ్లా నాయక్ మూవీ బుల్లి తెరలో సందడి ఒక్క రోజు ముందే సందడి చేయబోతున్న భీమ్లా నాయక్ మూవీ..

మల‌యాళంలో అదో క‌ల్ట్ క్లాసిక్‌ అయిన అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌ కు రీమేక్ గా భీమ్లా నాయక మూవీని తెరకెక్కించారు .. ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటించగా , రానా సరసన సంయుక్త మీనన్ నటించింది .. వకీల్ సాబ్ మూవీ తరువాత చేసిన మరో రీమేక్ మూవీ కావడం విశేషం .. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ టైటల్ రోల్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో కనిపించగా , నెగిటివ్ షేడ్స్ లో ఉన్న డానియెల్ శేఖర్ పాత్ర లో రానా అద్భుతంగా నటించారు , ఇక క్లైమాక్స్ లో అయితే వీరిద్దరి యాక్టింగ్ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ మూవీ ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఇక ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ యాక్టింగ్ , త్రివిక్రమ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. థియేటర్స్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ హిట్ అవ్వడంతో పాటు అతి కొద్దీ రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .. ఇక తాజగా భీమ్లా నాయక్ మూవీని కూడా ఆహా వేదికగా మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీలో చ్చిన్న మార్పు జరిగింది. ఇందుకు ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 24న ఆహాలో భీమ్లా నాయక్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజున జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుండడంతో ఒక్కరోజు ముందుగానే మార్చి 24 న స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించింది ఆహా. మొత్తానికి బీమ్లా నాయక్ మూవీ ఒక్క రోజు ముందుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నదుకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.