ఒక్క రోజు ముందుగానే ఓటీటీ లో బీమ్లా నాయక్ రిలీజ్ —

Pawan kalyan

పవర్ స్టార్ స్టామినా చూపించిన భీమ్లా నాయక్ మూవీ బుల్లి తెరలో సందడి ఒక్క రోజు ముందే సందడి చేయబోతున్న భీమ్లా నాయక్ మూవీ..

మల‌యాళంలో అదో క‌ల్ట్ క్లాసిక్‌ అయిన అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌ కు రీమేక్ గా భీమ్లా నాయక మూవీని తెరకెక్కించారు .. ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటించగా , రానా సరసన సంయుక్త మీనన్ నటించింది .. వకీల్ సాబ్ మూవీ తరువాత చేసిన మరో రీమేక్ మూవీ కావడం విశేషం .. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ టైటల్ రోల్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో కనిపించగా , నెగిటివ్ షేడ్స్ లో ఉన్న డానియెల్ శేఖర్ పాత్ర లో రానా అద్భుతంగా నటించారు , ఇక క్లైమాక్స్ లో అయితే వీరిద్దరి యాక్టింగ్ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ మూవీ ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఇక ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ యాక్టింగ్ , త్రివిక్రమ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. థియేటర్స్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ హిట్ అవ్వడంతో పాటు అతి కొద్దీ రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .. ఇక తాజగా భీమ్లా నాయక్ మూవీని కూడా ఆహా వేదికగా మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీలో చ్చిన్న మార్పు జరిగింది. ఇందుకు ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 24న ఆహాలో భీమ్లా నాయక్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజున జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుండడంతో ఒక్కరోజు ముందుగానే మార్చి 24 న స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించింది ఆహా. మొత్తానికి బీమ్లా నాయక్ మూవీ ఒక్క రోజు ముందుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నదుకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


ఓటిటి లోనితిన్ కొత్త సినిమా…

ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం మరో స్టోరీ వింటున్న యంగ్ హీరో నితిన్ “………

"ఓటీటీ  కోసం  స్టోరీ  వెతుకుతున్న  యంగ్  హీరో  నితిన్ "...

మన టాలీవుడ్ లో కంటెంట్ బాగుంటే ఉంటే చిన్న సినిమా అయిన , పెద్ద సినిమా అయిన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు .. పెద్ద సినిమా చూసేవాళ్ళు ఉన్నారు , చిన్న సినిమాను చూసే ప్రేక్షకులు ఉన్నారు ..ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ లో కి వెళ్లి సినిమా చూసే వీలు లేదు కాబట్టి ప్రేక్షకులందరూ ఇంట్లోనే ఉంది ఓటీటీ లో సినిమాలు చూస్తున్నారు .. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ కి మంచి డిమాండ్ పెరిగింది .. మహమ్మారి కరోనా కారణం వల్ల సినిమా ధియేటర్స్ మూత పడటంతో చిన్న సినిమాలు అన్ని ఎక్కువ గా ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి .. చిన్న సినిమాలకు కేర్ ఆఫ్ గా ఓటీటీ నిలిచింది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .. ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం నిర్మాతలు చాల ప్రత్యేకంగా సినిమాలు చేస్తున్నారు. ఓటీటీ లో రిలీజ్ చేస్తున్న సినిమాలకు నిర్మాతలకు బాగానే లాభం వస్తుంది .. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఓటీటీలో దొరుకుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఓటీటీ లో తమ సినిమాల రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు .. అతి తక్కువ సమయంలో సినిమాలను తీసి ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. , నితిన్ – డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మ్యాస్ట్రో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి మంచి లాభాలు అందుకుంది ..నితిన్ ఈ సినిమాలో నటించడంతో పాటు తన సొంత బ్యానర్ లో నిర్మించాడు .. అందుకే థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఎలా ప్రమోషన్స్ చేస్తారో.. అదే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ చేశారు .. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. నితిన్ కి మాత్రం భారీ లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ఏకంగా పదిహేను కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఓటీటీకి సినిమా తీసి ఇవ్వడంలో ఇన్ని లాభాలు వస్తాయనే విషయాన్ని గ్రహించిన నితిన్ ఇప్పుడు ఓటీటీ కోసం మరో సినిమా చేద్దాము అని డిసైడ్ అవుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి ..యంగ్ డైరెక్టర్లను ఓటీటీకి సరిపడా కథ ఏమైనా ఉంటే ఆ స్టోరీ ని నితిన్ అతి తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసి ఓటీటీ లో రిలీజ్ చేసే ప్లాన్ లోఉన్నాడు అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఓటీటీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. మొత్తానికి నితిన్ ఓటీటీ కోసం ఒక చిన్న బడ్జెట్ సినిమా చేద్దాము అని అనుకుంటున్నారు , దీని పై అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వస్తే గాని ఒక క్లారిటీ రాదు..