Freedom Oil | దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్ గా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్


తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్ ,జూన్ 24,2022జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇండియాలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సెగ్మెంట్‌లో ఈ ఏడాది వాల్యూమ్ సేల్స్ ప్రకారం నంబర్ వన్ బ్రాండ్‌గా ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ సన్‌ఫ్లవర్ ఆయిల్ కేటగిరీలో 20.5% విలువతో ‘ఫ్రీడమ్’ భారతదేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించినందుకు మేము సంతోషిస్తున్నాం” ఇది మా వినియోగదారు-కేంద్రీకృత విధానం, పటిష్టమైన పంపిణీ నెట్‌వర్క్, నాణ్యతపై దృష్టి పెట్టడం ఫలితంగా మా బ్రాండ్ ఈ విజయం సొంతం చేసుకుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉన్న తమిళనాడు, కేరళలో ప్రారంభించాలని మేము భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

‘భారతదేశంలో ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ అత్యధిక దిగుమతిదారు’ విభాగంలో ప్లాటినం అవార్డును కైవసం చేసుకుంది. 2018లో The Globoil India ‘Emerging Brand’ అవార్డు ‘ఫ్రీడమ్’ బ్రాండ్‌కు దక్కింది. ఇండియా టుడే ‘ఇస్పోస్ అర్బన్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే 2020’ ప్రకారం ‘ఫ్రీడమ్’ బ్రాండ్ భారతదేశంలోని టాప్ ఫైవ్ వంట నూనె బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.