కోదాడ MLA టికెట్ రేసులో BC మహిళ..?

అత్యంత ప్రతిష్టాత్మకమైన కోదాడ అసెంబ్లి సీట్ గెలవటం మీద అధికార పార్టి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఈ అసెంబ్లి సీట్ లో బిసి సామాజికవర్గానికి చెందిన మల్లయ్య యాదవ్ 2018 లో కేవలం 750 ఓట్ల మెజారిటి తో గెలుపొందారు. 2018 ఎలక్షన్ లో అఫిడవిట్ కు సంబందించి ప్రస్తుత MLA మీద కోర్ట్ కేసు పెండింగ్ లో ఉంది. ఒకవేల అభ్యర్దిని మారిస్తే మాజి నియోజకవర్గ ఇంచార్జి శశిధర్ రెడ్డి, NRI జలగం సుధీర్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టి నుండి పద్మావతి రెడ్డి స్వల్ప తేడా తో 2018 ఓడిపోయిన సానుభూతి, కాంగ్రెస్ పుంజుకుంటున్న వైనం, ప్రస్తుత MLA పై ఉన్న వ్యతిరేకత అధికార పార్టిని కలవరపెడుతుంది.

ఈ సమయం లోనే పద్మావతి రెడ్డి పై గెలవటానికి BC సామాజికవర్గానికి చెందిన జలగం సుధీర్ సతిమణి సుష్మా కల్లెంపూడి పేరు పరిశీలించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. దేశం లోనే మొట్టమొదటి మొబైల్ షీ టాయిలెట్ రూపకల్పనతో గుర్తింపు సాధించిన సుష్మా కోదాడ మునిసిపాలిటి లో పైలట్ ప్రాజెక్ట్ కూడ అంకురార్పణ చేశారు. ఉన్నత విద్యావంతురాలు, అమెరికాలో లక్షల్లో జీతం వచ్చె ఉద్యోగం వదిలి వచ్చి గత 8 సంవత్సరాలు గా కోదాడ లో తన భర్త సుధీర్ కు చేదొడుగా ఉండి అన్ని రకాల సమస్యల మీద అవగాహన కలిగి ఉండటం కలిసివచ్చె అంశం. 2005 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం లో భర్త తో కలిసి పనిచేయటం కూడ తెలంగాణ మీద సుష్మా కు ఉన్న పట్టు ను తెలియచేస్తుంది.

2001 నుండి జలగం సుధీర్ పార్టి కోసం కష్టపడుతున్నప్పటికి పెద్దగా అవకాశాలు రాకపోవటం తో నిరుత్సాహంగా ఉన్న సుష్మా ఇటివల కెసీఅర్ కూతురు కవితా గారిని కలిసి బాధ పడటం ఆ విషయం అధిష్టానం ద్రుష్టికి వెల్లటం తో జలగం సుధీర్ కు గాని, సుష్మా కు గాని ఎదైన మంచి అవకాశం కల్పించాలని పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు పార్టి వర్గాల్లో చర్చ నడుస్తుంది.

Leave a Reply