బాలయ్య లో మరో కోణాన్ని చూపిస్తానంటున్న అనిల్ రావిపూడి…

బాలయ్య లో మంచి కామిడీ టైమింగ్ ఉంది అనిల్ రావిపూడి…         

మన టాలివుడ్ దర్శకుల్లో ఒక్కో డైరెక్టర్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఒక్కోలా ఉంటుంది .. కొంతమంది దర్శకులు మాస్ సినిమాలు బాగా తీయగలరు , మరి కొంతమంది ఫ్యామిలీ సినిమాలు బాగా హాండెల్ చేయగలరు , మరికొంత మంది కమ్మర్షియల్ సినిమాలు బాగా హాండెల్ చేయగలరు ఏది ఏమి అయిన ప్రేక్షకులు కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు ఆదరిస్తారు , మన దగ్గర ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో కొంత మంది అపజయం అనేదే లేని డైరెక్టర్స్ కొంత మంది ఉన్నారు , వారిలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి , కొరటాల శివ , మరియు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి .. ప్రస్తుతం రాజమౌళి , కొరటాల శివ తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మంచి డిమాండ్ ఉంది .. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాకు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎలా రాసుకుంటారో , అలానే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తన సినిమాలకు తానే అన్ని రాసుకుంటారు , అనిల్ రావిపూడి సినిమాలు అన్ని కామిడీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్ అవుతున్నాయి ..

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఈ యంగ్ డైరెక్టర్ తో ఒక్క సినిమా అయిన చెయ్యాలి అని మన హీరోలు క్యూ కడుతున్నారు ..ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ -2 సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ..ఎఫ్ – 3 సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి – నందమూరి బాలకృష్ణ తో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతం బాలకృష్ణ – అఖండ్ సినిమా లో నటిస్తున్నారు , ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది , అఖండ సినిమా తరువాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి .. ఎఫ్ – 3 సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి , మహేష్ బాబు తో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి , కానీ ప్రస్తుతము మహేష్ బాబు డైరీ కాలి లేదు , మహేష్ బాబు చేతిలో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి , ఈ నేపథ్యంలో మహేష్ బాబు తో సినిమా చేయాలన్నా రాజమౌళి – మహేష్ సినిమా పూర్తి అయితేనే – వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది .. ఎఫ్ -3 సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా పక్కాగా చేస్తున్నారు , దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తి అయింది .గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ సినిమా పూర్తి కాగానే , అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కనున్నది . మొత్తానికి బాలయ్య బాబు కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏటువంటి సబ్జెక్ట్ రెడీ చేసారో , అలానే , వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …