భారతదేశంలో న్యూక్లియర్ టర్బైన్లకు కీలకమైన రొటేటింగ్ భాగాలను సరఫరా చేసిన తొలి సంస్థ‌గా ఆజాద్ ఇంజనీరింగ్

తెలుగు సూపర్ న్యూస్, హైద‌రాబాద్, ఫిబ్ర‌వ‌రి 6, 2023: ప్రెసిష‌న్ ఇంజినీరింగ్‌లో మార్కెట్‌లో అగ్ర‌గామిగా ఉన్న హైద‌రాబాద్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్.. న్యూక్లియ‌ర్ ట‌ర్బైన్లకు కీల‌క‌మైన రొటేటింగ్ భాగాల‌ను స‌ర‌ఫ‌రా చేసే తొలి సంస్థ‌గా నిలిచింది. ఈ కీల‌క భాగాల తొలి సెట్‌ను డెలివ‌రీ చేశారు. వాటిని ఫ్రాన్స్ దేశంలోని బెల్‌ఫోర్ట్‌లో త‌యారుచేసే న్యూక్లియ‌ర్ ట‌ర్బైన్స్‌లో అసెంబుల్ చేస్తారు. ఇందుకోసం ఆజాద్ సంస్థ న్యూక్లియ‌ర్ ట‌ర్బైన్స్ విడి భౄగాల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు జీఈ స్టీమ్ ప‌వ‌ర్ కంపెనీతో దీర్ఘ‌కాల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఈ సంస్థ‌కు చాలా పెద్ద అవ‌కాశం, దేశానికి కూడా గ‌ర్వ‌కార‌ణం.


జీఈ స్టీమ్ పవర్ విద్యుత్ ప్లాంట్ల కోసం సాంకేతికతలు, సేవలతో కూడిన‌ విస్తృత పోర్ట్ ఫోలియోను అందిస్తుంది. త‌ద్వారా వినియోగదారులు భ‌విష్య‌త్తులో తక్కువ కార్బన్ విడుద‌ల చేసే విభాగాల‌కు మారినప్పుడు నమ్మదగిన విద్యుత్తును అందించడంలో సహాయపడుతుంది. గ్రీన్, జీరో ఎమిషన్ క్లీన్ ఎనర్జీ వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే దిశగా ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అణువిద్యుత్ అత్యంత చ‌వ‌కైన‌, శుభ్రమైన జీరో కార్బోనైజ్డ్ విద్యుత్ వనరులలో ఒకటి. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు అందుబాటులో ఉన్న మంచి ప్రత్యామ్నాయాలలో ఒకటి.


ఈ సందర్భంగా ఆజాద్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ చోప్దార్ మీడియాతో మాట్లాడుతూ, “న్యూక్లియ‌ర్ ట‌ర్బైన్ల‌ విడిభాగాలకు అనుమతులు పొందిన తొలి, ఏకైక భారతీయ కంపెనీ మాదేనని ప్రకటించడానికి చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. అత్యంత కఠినమైన వాతావరణంలో న్యూక్లియర్ టర్బైన్ల కోసం కీలకమైన రొటేటింగ్ భాగాలను తయారు చేయడానికి మేము జీఈ స్టీమ్ పవర్ సంస్థ‌తో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నాము. 2022 మాకు గొప్ప సంవత్సరం. ఒక సంస్థగా, ఇది నిజంగా పెద్ద మైలురాయి. ఇది 10 రెట్లకు పెర‌గాల‌న్న మా పంచ‌వ‌ర్ష ప్రణాళిక వైపు మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుందని మేము నమ్ముతున్నాము” అన్నారు.

భార‌త‌దేశంలోనే త‌యారుచేయాల‌న్న ప్ర‌స్తుత ఆలోచ‌న‌ల నుంచి.. ఇక్క‌డ త‌యారుచేసి విశ్వ‌వ్యాప్తంగా పంపేలా భార‌త‌దేశాన్ని అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై పెట్టాల‌న్న‌ల‌క్ష్యంతో చోప్దార్ కృషి చేస్తున్నారు. అంత‌ర్జాతీయ ఓఈఎం ఎండ్-టు-ఎండ్ అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చేందుకు ఒకేచోట ల‌భించే అంత‌ర్జాతీయ స్థాయి స‌దుపాయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు ఇంత అద్భుత‌మైన అవ‌కాశాన్ని క‌ల్పించినందుకు జీఈ స్టీమ్ ప‌వ‌ర్ సంస్థ‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన ఆజాద్ ప్రఖ్యాత గ్లోబల్ పవర్ జనరేషన్, ఏరోస్పేస్ ఓఈఎంలకు వన్-స్టాప్ భాగస్వామిగా స్థిరపడింది. రాబోయే 18-24 నెలల్లో రాబోయే కొత్త సదుపాయంతో ప్రాధాన్య భాగస్వామిగా తన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, ఫ్లాగ్ షిప్‌ స్థానాన్ని ఆస్వాదించడాన్ని కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది.

Leave a Reply