ఏంజెల్‌ & రాకెట్‌ రెండవ ఔట్‌లెట్‌ప్రారంభం

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్,మే 5,2023: శరత్‌ సిటీక్యాపిటల్‌ మాల్‌లో తమ తొలి స్టోర్‌ సాధించిన విజయం అందించిన స్ఫూర్తితో  కిడ్స్‌ క్లాతింగ్‌ స్టోర్‌, ఏంజెల్‌ & రాకెట్‌  తమ తలుపులను బంజారాహిల్స్‌  రోడ్‌ నెంబర్‌ 12లో తెరిచింది.  ఈనూతన స్టోర్‌ 1588 చదరపుఅడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా బ్రాండ్‌, స్ర్పింగ్‌ సమ్మర్‌ కలెక్షన్‌ప్రదర్శించనుంది.

వేసవి ఆనందానికి మరింత సంతోషాన్నిజోడిస్తూ స్టేట్‌మెంట్‌ స్లీవ్స్‌తో బ్రాడిరీ, ప్రైరీ గాళ్‌ ప్రింట్స్‌తోకూడిన కూల్‌ కో–ఆర్డ్‌సెట్స్‌తో టెక్చర్డ్‌ కాటన్‌ వస్త్రాలు ఈ వసంత కాలాన్ని మరింత ఆహ్లాదంగామారుస్తాయి.ఈ వేసవి కలెక్షన్‌ పూర్తి స్థాయిలోప్రకాశం, ఆనందం, శైలి అందిస్తుందనేవాగ్ధానం చేస్తుంది. బాలికల కోసం  ఈబ్రాండ్‌ , డిజిటల్‌లావెండర్‌తో చిలకరించినట్లుగా తేలికపాటి,సౌకర్యవంతమైన కాటన్‌ సీర్‌సక్కర్స్‌ ఫ్యాబ్రిక్స్‌తో ఆహ్లాదంగా, ఆందంగా ఉంచుతుంది.

సూక్ష్మ అంశాలకు కూడా అమిత ప్రాధాన్యతఅందించడంతో పాటుగా డిజైన్‌,నాణ్యత పట్ల అమిత శ్రద్ధ చూపే ఏంజెల్‌ & రాకెట్‌ ,తమ వినియోగదారులకు రాజీలేనటువంటి రీతిలోవస్త్రాలు అందిస్తుంది. ‘బై బెటర్‌, వియర్‌ లాంగర్‌.హ్యాండ్‌ డౌన్‌’ అనేసిద్ధాంతంతో నడుపబడుతుండటంతో పాటుగా ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ వస్త్రశ్రేణిరూపొందిస్తుంటుంది. ఈ వస్త్రాలన్నీ కూడా పర్యావరణ అనుకూలంగానే ఉంటాయి. ఈవస్త్రాలను యుకెలో డిజైన్‌ చేయడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా నీతివంతమైనఫ్యాక్టరీలలో  తయారుచేస్తున్నారు.  ఏంజెల్‌ & రాకెట్‌ న్యాయమైన  వాణిజ్యం చేయడంతో పాటుగారీసైకిల్డ్‌ పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్స్‌,ఆర్గానిక్‌ కాటన్స్‌ వినియోగిస్తుంది.

ఈ నూతన స్టోర్‌ ప్రారంభం సందర్భంగా కో–ఫౌండర్‌ ఎస్‌చెందురన్‌ మాట్లాడుతూ  ‘‘నా భాగస్వామిలూయిస్‌ బోస్టోక్‌ ,తాను తమ రెండవ స్టోర్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రారంభించడం పట్ల చాలా సంతోంగా ఉన్నాము.శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో ఏర్పాటుచేసిన తమ మొదటి స్టోర్‌కు చక్కటి స్పందనఅందుకున్నాము. కిడ్స్‌వేర్‌కు ఈ తరహా ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. డిమాండ్‌  ధోరణి కనిపిస్తుండటం, ఫ్యాషన్‌లు కూడాపెరుగుతుండటం చేత ఏంజెల్‌ & రాకెట్‌  లాంటి బ్రాండ్లకు ప్రీమియం నాణ్యత కలిగినకిడ్స్‌వేర్‌ క్లాతింగ్‌ అందించే అవకాశం కలుగుతుంది’’ అని అన్నారు.

శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లోఏర్పాటుచేసిన మొదటి స్టోర్‌ చక్కటి ఆదరణ పొందుతుంది. రిపీట్‌ కస్టమర్ల రాక పెరుగుతుండటం చేత గణనీయంగా అమ్మకాలుపెరుగుతున్నాయి.  తమ విస్తరణ ప్రణాళికలపట్ల ఈ బ్రాండ్‌ పూర్తి ఆసక్తిగా ఉంది. హైదరాబాద్‌లో మరో స్టోర్‌ తెరిచేందుకు తగిన అవకాశాలున్నాయని సంస్థ నమ్ముతుంది. త్వరలోనే  చెన్నై,ఢిల్లీలో కూడా స్టోర్లను ప్రారంభించనుంది.

Leave a Reply