“ఆంధ్రప్రదేశ్ లోక్ సభ & శాసనసభలో ఎవరెవరు?” పుస్తకాన్ని ఆవిష్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..

తెలుగు సూపర్ న్యూస్ ఆగస్టు 5,2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఫోటోలు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’.

ఈ సమాచారాన్ని మారిశెట్టి మురళీ కుమార్ సేకరించి పుస్తకరూప మిచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి పవన్ కళ్యాణ్ “ముందుమాట” కూడా రాశారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత మురళీ కుమార్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ..ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికీ, ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ పుస్తకం ఆగష్టు చివరి వారంలో మార్కెట్లో అందుబాటులోకి రానుందని మారిశెట్టి మురళి తెలిపారు.

Leave a Reply