బోయపాటి శ్రీను అల్లు అర్జున్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ కాంబో లో మూవీ ఫిక్స్ ...

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తరువాత తానూ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రతాలు తీసుకుంటున్నారు .. అల వైకుంఠపురములో సినిమా తరువాత తాను ఏ డైరెక్టర్ తో ఎలాంటి స్టోరీ ని ఒకే చెయ్యాలి , కొత్త స్టోరీస్ ను చాలా జాగ్రత్తగా వినడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు పార్ట్శ్ గా తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది .. పుష్ప సినిమా పూర్తి కాగానే అల్లు అర్జున్ , డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ , మరియు వేణు శ్రీ రామ్ , ప్రశాంత్ నీల్ లైన్ లో పెట్టినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. పుష్ప సినిమా తరువాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఐకాన్ అని చిత్ర పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా తరువాత , డైరెక్టర్ కొరటాల శివ కూడా అల్లు అర్జున్ కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. ప్రస్తుతము కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్నారు , ఈ సినిమా పూర్తి అయినా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు , మరి తారక్ తో సినిమా పూర్తి కాగానే కొరటాల శివ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్సుమెంట్ చేస్తారు .. ప్రస్తుతానికి బన్నీ ఫోకస్ అంతా పుష్ప సినిమా మీదనే ఉంది .. పుష్ప సినిమా పూర్తి అయిన తరువాతనే బన్నీ తన నెక్స్ట్ సినిమా అనౌన్సుమెంట్ చేస్తారు ….

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో చాలా రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. బోయపాటి శ్రీను – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా వినయ విధేయ రామ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , అండ్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది .. వినయ విధేయ రామ సినిమా తరువాత బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని , బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా గా అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు , బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి .. బోయపాటి శ్రీను అఖండ సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్ స్టార్ సూర్య తో చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు కూడా వచ్చాయి , అలానే కన్నడ స్టార్ యశ్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి …

ఈ వార్తలు అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ , అల్లు అర్జున్ – బోయాపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా ఉండబోతుంది అని గత కొంత కాలంగా సోషల్ మీడియా లో వార్తలు గట్టిగా వినిపించాయి , ఇక అసలు విషయానికి వెళ్ళితే , బోయపాటి శ్రీను అఖండ సినిమా పూర్తి కాగానే మాస్ మహారాజ్ రవితేజ , మరియు అల్లు అర్జున్ కోసం స్టోరీస్ రెడీ చేసుకొన్నారు . అయితే మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా తరువాత ఖిలాడీ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తరువాత ఇంకో సినిమా సెట్స్ మీద ఉన్నది . ఈ క్రమంలో మొత్తానికి బోయపాటి మళ్లీ బన్నీ తో సినిమా ఖరారు అయినట్లే తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన సరైనోడు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా బన్నీ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. గీతా ఆర్స్ట్ సాధించిన బ్లాక్ బస్టర్ వసూళ్లలో మగధీర సినిమా తర్వాత సరైనోడు సినిమానే నిలిచింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి అఖండ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు .. బన్ని సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం పుష్పలో నటిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి….. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ – తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఉంటుందా లేక డైరెక్టర్ వేణు శ్రీ రామ్ తో ఐకాన్ సినిమా ఉండబోతుందా అనే విషయం పై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు ఆగాలిసిందే ……..