రంగుల క‌ళ‌ల‌కు ఏడాది పూర్తి ఏలియన్స్ టాటూ హైదరాబాద్ తొలి వార్షికోత్సవం

హైదరాబాద్, ఇండియా, ఏప్రిల్ 30, 2023: ఏలియన్స్ టాటూ హైదరాబాద్ స్టూడియో తొలి వార్షికోత్సవం ఏప్రిల్ 29న జ‌ర‌గ‌నుంది. కేవలం ఏడాది వ్య‌వ‌ధిలోనే ఈ స్టూడియో నగరం అంతటా టాటూ ఔత్సాహికులు ప్రేమించే గమ్యస్థానంగా మారింది. ఈ మైలురాయిని అంద‌రితో క‌లిసి జ‌రుపుకోవ‌డానికి ఏలియ‌న్స్ టాటూ బృందం ఎంతో సంతోషంగా ఉంది.

వార్షికోత్సవ కార్యక్రమం కళలు, జ్ఞాపకాల వేడుక. స్టూడియోకు చెందిన ప్రతిభావంతులైన కళాకారులు లైవ్ టాటూ ప్రదర్శనలు, వారి విభిన్న శైలులు, పద్ధతులను ప్రదర్శిస్తారు. ఇంకా ఏలియన్స్ టాటూ హైదరాబాద్ బృందం రూపొందించిన కళాఖండాల ప్రదర్శన, అతిథులు ఫొటోలు తీయడానికి, జ్ఞాపకాలను బంధించడానికి ఫోటో బూత్ ఉంటుంది. ఇంకా అనేక కార్యకలాపాలు, స‌ర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయి. స్టూడియో కళాకారులు, సిబ్బందిని కలుసుకోవడం, పలకరించడంతో పాటు అల్పాహారం, స్నాక్స్ తీసుకోవ‌చ్చు.

ఈ సంద‌ర్భంగా ఏలియ‌న్స్ టాటూ హైద‌రాబాద్ ఫ్రాంచైజీ యజమాని అమృత్ పాల్ అహుజన్ మాట్లాడుతూ, “మా వ్యాపారం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో సాధించిన విజ‌యాల‌కు మేము చాలా గర్వపడుతున్నాము. టాటూ కళ పట్ల మా అభిరుచికి, మా క్లయింట్లు, స్నేహితులు, కుటుంబాల‌ అచంచలమైన మద్దతుకు మా ప్రగాఢమైన ప్రశంసలతో కూడిన‌ వేడుకే ఈ కార్యక్రమం. హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక సంఘంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడటానికి మేము ఇక ఏమాత్రం వేచి ఉండలేం” అన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏలియన్స్ టాటూ వ్య‌వ‌స్థాప‌కులు స‌న్నీ భానుశాలి మాట్లాడుతూ, “ఏలియన్స్ టాటూ హైదరాబాద్ తొలి వార్షికోత్సవం నాలో గర్వాన్ని, కృతజ్ఞతను నింపింది. ఇది అద్భుత‌మైన‌ ప్రయాణం. ప్రతిభావంతులైన మా బృందం కృషి, మా క్లయింట్లు, స‌మాజ మద్దతు లేకుండా మేము ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు. ఇప్పటివరకు మా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, భవిష్యత్తు మాకు ఏం ఇస్తుందో అన్న విష‌యం గురించి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను” అని చెప్పారు.

ఏలియన్స్ టాటూ హైదరాబాద్ టాటూ ఔత్సాహికులందరికీ సురక్షితమైన, పరిశుభ్రమైన, సృజనాత్మక వాతావరణాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. నైపుణ్యం కలిగిన, అనుభవజ్ఞులైన కళాకారుల బృందం క్లయింట్లకు వారు కోరుకున్న‌ట్లుగా ఉండే, నాణ్య‌మైన టాటూలతో జీవం పోయడానికి అంకితమైంది. 2023 ఏప్రిల్ 29 సాయంత్రం 4 గంటల నుంచి ఏలియన్స్ టాటూ హైదరాబాద్ తన వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి అందరికీ ఇదే మా ఆహ్వానం. ప్రతి ఒక్కరినీ కళలు, జ్ఞాపకాల వేడుకలో భాగం కావాల‌ని స్టూడియో సాదరంగా ఆహ్వానిస్తోంది.

ఏలియన్స్ టాటూ గురించి: ఏలియన్స్ టాటూ అనేది క‌స్ట‌మ‌ర్ల‌ ఆలోచనలు, విలువలు, నమ్మకాల ఆధారంగా రూపొందిన సృజనాత్మక, ప్రత్యేకమైన కస్టమైజ్డ్ టాటూను కోరుకునేవారికి న‌చ్చే బ్రాండ్. అవార్డు విజేత‌లైన‌ టాటూ కళాకారులు.. త‌మ అసాధారణ నైపుణ్యాలు, కళాత్మక దృష్టి విష‌యంలో ముంబైతో పాటు భారతదేశం అంతటా ప్రసిద్ది చెందారు. దేశంలోని ఉత్తమ టాటూ స్టూడియోలలో ఒకటిగా నిలిచిన ఏలియన్స్ టాటూ.. సెలబ్రిటీలు, క్రీడాకారులకు ఇష్టమైన ఎంపికగా మారింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రోషిణి చోప్రాతో పాటు మీకు ఇష్టమైన చాలా మంది ప్రముఖులను మా స్టూడియో స్వాగతించింది. మీ టాటూ విజన్ కు ప్రాణం పోయడానికి, వ్యక్తిగత, అసాధారణమైన కళాకృతిని సృష్టించడానికి మమ్మల్ని విశ్వసించండి.

వ్యవస్థాపకుడి గురించి: సన్నీ భానుశాలి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్య‌క్తి. ఫొటో-రియలిస్టిక్ టాటూలు, హైపర్-రియలిస్టిక్ టాటూలు, హిందూ పురాణాల ఆధారంగా కాన్సెప్ట్ టాటూలపై చేసిన కృషికి భారతదేశంలో ఉత్తమ టాటూ క‌ళాకారుడిగా నిలిచారు. ఆయ‌న‌ ముంబైలోనే కాదు.. దేశంలోనే ఉత్తమ టాటూ కళాకారుడు.

Leave a Reply