సెకండ్ సినిమాతో ఫేడ్ అవుట్ అయిన అజయ్ భూపతి

అర్జున్‌ రెడ్డి సినిమా భారీ హిట్ అవ్వడంతో మన టాలీవుడ్ లో డైరెక్టర్స్ మరియు నిర్మాతలు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు .. డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచిన అజయ్‌ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100.. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది . ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , మరియు సాంగ్స్ , పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా నేటివిటి నేపథ్యంగా రాసుకొన్న కథ గ్రామీణ వాతావరణం అద్దం పట్టింది. ఫీల్‌గుడ్ అంశాలతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తూ చివరగా ఎమోషనల్ అంశాలతో ముగించడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ఆర్‌ఎక్స్‌ 100 మొదటి సినిమాతో నే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లోనూ మరియు ఇండస్ట్రీ లోను అందరి చేత మంచి ప్రశంసలు అందుకున్నారు .. 2018 లో రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘ ఆర్ఎక్స్ 100 ‘ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా హీరో కార్తికేయ కు మంచి గుర్తింపు లభించింది ..

ఆర్‌ఎక్స్‌ 100 సినిమా తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ‘మహాసముద్రం’ అనే సినిమాను తెరకెక్కించారు ..మహాసముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా తో పక్కా హిట్ కొడతా అని ధీమా వ్యక్తం చేశారు . మహా సముద్రం సినిమా స్టోరీ ముందుగా చాలా పెద్ద హీరోలకు వినిపించిన డైరెక్టర్ అజయ్ భూపతి ఫైనల్ గా హీరో శర్వానంద్ , మరియు సిద్ధార్థ్‌ తో తెరకెక్కించారు .. . మొదటి సినిమా తో బోల్డ్ కంటెంట్ తో బిగ్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తన రెండవ సినిమా ‘మహాసముద్రం’ సినిమా తో మటుకు ఫేడ్ అవుట్ అయిపోయారు .. తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి గురించి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి , ప్రస్తుతం అజయ్ మాహాసముద్రం సినిమా తరువాత ఏ హీరో కోసం స్టోరీ రెడీ చేస్తున్నారు అనే విషయం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు ,అలానే సోషల్ మీడియా , మరియు ట్విట్టర్ లోను ప్రేక్షకులు నెక్స్ట్ సినిమా ఏ హీరో తో అని అడిగిన ప్రశ్న కు కూడా డైరెక్టర్ అజయ్ భూపతి సమాధానం ఇవ్వడం లేదు ..మొత్తానికి డైరెక్టర్ అజయ్ భూపతి మాహాసముద్రం సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా అనేది ఇన్ని రోజులు అయిన ఎనౌన్స్ మెంట్ చేయలేదు .. అలానే ఈ డైరెక్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా లేరు ..మొత్తానికి డైరెక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా ఏ హీరో తో కమిట్ అయ్యారు అసలు ఏ హీరో కోసం స్టోరీ రెడీ చేస్తున్నారు అనే విషయం పై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..