బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న అడవి శేష్ …

కొత్త జర్నీ మొదలు పెట్టిన అడవి శేష్...


         
మన టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడవి శేష్ కు ప్రత్యేక స్థానం ఉంది . ఈ యంగ్ హీరో సెలెక్ట్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ , మరియు జానర్స్ , చాలా యూనిక్ పాయింట్ తో విభిన్నమైన స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ తన సినీ జర్నీ ని మొదలు పెట్టాడు .. రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ తనకంటూ ఒక సెపెరేట్ రూట్ ఏర్పరచుకున్నారు . తన సినీ కెరీర్ మొదటగా చిన్న చిన్న సినిమాలతో మొదలు పెట్టి ఈ రోజున పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరారు .. సినిమా అవాకాశం రావడమే కష్టం , వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి క్యారెక్టర్ లో కొత్తదనం ప్రేక్షకులకు చూపిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ని అందరి డైరెక్టర్స్ దగ్గర మంచి ప్రశంసలు అందుకున్నారు . అడవి శేష్ సినిమాలకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ అండ్ డిమాండ్ ఉంది అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు .. అడవి శేష్ – డైరెక్టర్ వెంకట్ రాంజీ కాంబినేషన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా “ఎవరు” .ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు మేకింగ్ ,అడివి శేష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . ఎవరు సినిమా హిట్ అవ్వడమే కాకుండా ఫిల్మ్ క్రిటిక్స్ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు .. అడవి శేష్ తన సినీ కెరీర్ మొదలు పెట్టినప్పుడు చాలా చిన్న బడ్జెట్ తో సినిమాలు చేసి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజున పాన్ ఇండియా స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నారు .. ఎవరు సినిమా తరువాత అడవి శేష్ కొంత గ్యాప్ తీసుకొని మేజర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో 2022, ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది .. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు .. ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మరియు GMB ఎంటర్‌టైన్‌మెంట్ A+S మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. . ఈ సినిమా లో హీరో అడవి శేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా అడవి శేష్ సినీ కెరీర్ కు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒక సోషల్ మీడియా లో వినిపిస్తుంది . మేజర్ సినిమా రిలీజ్ కాకుండానే హీరో అడవి శేష్ మరో రెండు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసినట్లు గా వార్తలు వస్తున్నాయి . ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అయింది . మొత్తానికి హీరో అడవి శేష్ బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది , మరి అడవి శేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏ సినిమా తో మరియు ఏ డైరెక్టర్ కాంబినేషన్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో లోకి ఎంటర్ అవుతున్నారో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు ఎదురు చుడాలిసిందే ..