ఆశీర్వాద్ గులాబ్ జామున్ “కిడ్స్ ఫర్ కిడ్స్” క్యాంపెయిన్

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 21, 2022:ఐటీసీ లిమిటెడ్ ఆశీర్వాద్ గులాబ్ జామున్ , దేశంలో గులాబ్ జామూన్ మిక్స్ బ్రాండ్‌లలో ఒకటి, హైదరాబాద్ మరియ వైజాగ్‌లలో – ఈ దీపావళికి ప్రత్యేకమైన కార్యక్రమంగా ‘కిడ్స్‌ ఫర్ కిడ్స్’ ను ప్రారంభించింది. సెప్టెంబర్ 2022లో ప్రారంభించగా, హైదరాబాద్ మరియు వైజాగ్‌లోని పాఠశాలలతో కలిసి 500 మంది పాఠశాల విద్యార్థులతో గులాబ్ జామూన్‌లను చేతితో తయారు చేయడానికి ఆశీర్వాద్ బ్రాండ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

పాఠశాల విద్యార్థులు తయారు చేసే ప్రతి గులాబ్ జామూన్‌కు, ఐటీసీ లిమిటెడ్ యొక్క ఆశీర్వాద్ గులాబ్ జామున్ ఆంధ్రప్రదేశ్ మరియ తెలంగాణాలలోని గ్రామీణ పాఠశాలల్లోని పిల్లలకు ఐదు రెట్లు ఎక్కువగా గులాబ్‌ జామూన్‌లను తయారు చేసేందుకు ముడి పదార్ధాలను అందించింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ ప్రచారంలో తొలి దశకు అద్భుతమైన విజయం దక్కిన అనంతరం, విస్తృతంగా ప్రజలను చేరుకునేందుకు, అలాగే గ్రామీణ పాఠశాలల్లోని చిన్నారులకు ఈ దీపావళిని ప్రత్యేకంగా నిలపడం కోసం, ప్రేక్షకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో, రెండవ దశ ప్రచారాన్ని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభించారు.

అందరూ 84639 84639 నెంబర్‌కు మిస్డ్ కాల్‌ ఇవ్వడం ద్వారా ఈ ప్రచారంలో పాల్గొనవచ్చు. అందుకున్న ప్రతి మిస్డ్ కాల్‌కు, ఆంధ్రప్రదేశ్ మరియు  తెలంగాణాలోని గ్రామీణ పాఠశాలల్లో ఉన్న పిల్లలకు 5 గులాబ్ జామూన్‌లను సిద్ధం చేయడానికి ఆశీర్వాద్ గులాబ్ జామున్ అవసరమైన పదార్థాలను అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ పాఠశాలల్లో లక్ష మంది పిల్లలను చేరవేయాలని ఆశీర్వాద్ లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ కార్యక్రమం గురించి గణేష్ సుందరరామన్, ఎస్‌బీయూ చీఫ్ ఎగ్జిక్యూటివ్, స్టేపుల్స్, స్నాక్స్ మరియు మీల్స్, ఫుడ్‌. బిజినెస్, ఐటీసీ లిమిటెడ్, మాట్లాడుతూ “ప్రేమ, ఆనందం, వెలుగు జిలుగులను పండుగలు పంచపెడతాయి. ఈ కార్యక్రమం ద్వారా,  పిల్లలలో పంచుకునే ఆనందాన్ని తిరిగి తీసుకువచ్చి, వేడుక చేసుకోవాలని ఆశీర్వాద్ గులాబ్ జామున్ కోరుకుంది. ఈ కార్యక్రమం ఇందులో పాల్గొనే వారి ముఖాలలో చిరునవ్వులను తీసుకు వస్తుందని, అలాగే ఈ పండుగ సీజన్‌ను మరుపు రానిదిగా చేస్తుందని మేము ఆశిస్తున్నాము,” అన్నారు.

సద్గురు శ్రీ మధుసూదన్ సాయి, ఫౌండర్, శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్, మాట్లాడుతూ “ఈ దీపావళికి శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్‌లో, మేము ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్‌ సహకారంతో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా మనకు మాదిరిగా పండుగ ఆనందాన్ని ఆస్వాదించలేని వారి కోసం, లక్ష మంది గ్రామీణ పాఠశాల విద్యార్థులతో కలిసి పండుగ యొక్క మధురమైన ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్నాము,” అని తెలిపారు.

వీడియో ప్రచారానికి లింక్‌: https://youtu.be/NdCm_kkRXyI

Leave a Reply