హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫిబ్ర‌వ‌రి 2,3,4 తేదీల్లో 25వ జాతీయ హెచ్ఆర్‌డీ స‌ద‌స్సు..

తెలుగు సూపర్ న్యూస్ డాట్ కామ్,హైదరాబాద్,జనవరి 31,2023: జాతీయ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఆర్‌డీ) ఆధ్వర్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫిబ్ర‌వ‌రి 2,3,4 తేదీల్లో మూడు రోజులపాటు 25వ వార్షిక స‌దస్సు జరగనుంది. వెయ్యి మందికి పైగా అతిథులు110 మందికి పైగా వ‌క్త‌లు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

ఈ సంవ‌త్స‌రం జ‌రిగే స‌ద‌స్సు దేశంలోని హెచ్ఆర్ కార్య‌క్ర‌ మాల‌న్నింటిలోకెల్లా అతి పెద్ద‌ది. ఈ స‌ద‌స్సులో హెచ్ఆర్ ప్ర‌ముఖులు, నిపుణులు, దేశ‌వ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులు పాల్గొననున్నారు. వీరంతా “డీకోడ్ ద ఫ్యూచ‌ర్” అనే అంశంపై చ‌ర్చిస్తారు.

హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీ నోవాటెల్ లో ఎన్ హెచ్ ఆర్ డీ సదస్సు జరగనుంది. ఈ సదస్సును తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించి ‘ఆర్థిక భవిష్యత్తును డీకోడింగ్ చేయడం: 5టీ ఎకానమీకి ఉత్ప్రేరకంగా హైదరాబాద్’ అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సాహభరితమైన‌ కార్యక్రమానికి పరిశ్రమ నిపుణులు డాక్టర్ విపుల్ సింగ్ (ఎన్‌హెచ్ఆర్‌డి హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్) నాయకత్వం వహించడం, జాతీయ చాప్టర్ అధ్యక్షుడు ఎస్.వి.నాథన్, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీని వుడుముల ఈ బృహత్తర కార్యక్రమాన్నినడిపిస్తారు.

హాజరైనవారికి తాజా హెచ్ఆర్‌ ధోరణులు, వ్యూహాలు, సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి, తోటివారితో అర్థవంతమైన చర్చల్లో నిమగ్నం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ స‌ద‌స్సులో పాల్గొనేవారికి సంబంధాలను పెంపొందించుకోవడానికి, వారి వృత్తిప‌ర‌మైన‌ నెట్ వర్క్ లను విస్తరించడానికి బోలెడ‌న్ని అవకాశాలను అందిస్తుంది.

“25వ ఎన్‌హెచ్ఆర్‌డీ సదస్సుకు ఆతిథ్యమివ్వడం, హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కు భవిష్యత్తును డీకోడ్ చేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది” అని ఎన్‌హెచ్ఆర్‌డీ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ విపుల్ సింగ్ అన్నారు.

“హెచ్ఆర్ లీడర్లు నేర్చుకోవడానికి, ఎదగడానికి, ప్రేరణ పొందడానికి ఒక స్థలాన్ని సృష్టించడమే మా లక్ష్యం. హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, అర్థవంతమైన కనెక్షన్లు పొంద‌డానికి ఈ కాన్ఫరెన్స్ ఒక విలువైన అవకాశం అవుతుందని మేం విశ్వసిస్తున్నాము” అని ఆయ‌న తెలిపారు.

Leave a Reply