బిందాస్‌ ప్లాన్‌ కర్‌ ప్రచారం ప్రారంభించడం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకున్న యాత్ర ఆన్‌లైన్‌ లిమిటెడ్‌

Yatra Online Ltd

తెలుగు సూపర్ న్యూస్ డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌ 20 మార్చి 2023 : భారతదేశంలో సుప్రసిద్ధ కార్పోరేట్‌ ట్రావెల్‌ సేవల ప్రదాత, భారతదేశంలో సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీలలో ఒకటైన యాత్ర ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ (యాత్ర) , తమ తాజా ప్రచారం– ‘జబ్‌ యాత్ర హై తో కాహీ కా డర్‌, బిందాస్‌ ప్లాన్‌ కర్‌’ ను ప్రారంభించింది. దీని ద్వారా తమ వినియోగదారులకు ఒత్తిడి లేని యాత్రానుభవాలను అందిస్తుంది. ఈ ప్రచారాన్ని ప్రధానంగా యాత్ర డాట్‌ కామ్‌పై అందుబాటులో ఉన్న క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌పై దృష్టి సారించి తీర్చిదిద్దారు. https://www.instagram.com/reel/Cp5FikOhPly/?igshid=MGU3ZTQzNzY%3D

ఏవైనా ఇబ్బందికరమైన ఆటంకాలు లేదా నిర్ధారించబడని ప్రణాళికలు ఉన్నప్పటికీ ప్రయాణికుల యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతుందనే భరోసాను ఇది అందిస్తుంది. క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ అనేది భీమా పాలసీ. దీనిని యాత్ర వెబ్‌సైట్‌, మొబైల్‌ సైట్‌, మొబైల్‌ యాప్‌ పై ఫ్లైట్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకున్న వినియోగదారులకు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ అందిస్తుంది. ఈ సదుపాయం ద్వారా ఫ్లైట్‌ టిక్కెట్‌ క్యాన్సిల్‌ చేయబడిన పరిస్థితిలలో ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరను వినియోగదారులు పొందే అవకాశం కలుగుతుంది.

ఈ తాజా ఆఫరింగ్‌కు తోడుండటంతో పాటుగా ఈ ఆఫర్‌ను అధిక శాతం వినియోగదారులు వినియోగించుకునేందుకు వీలుగా డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రచారం ప్రారంభించారు. దీనిలో మూడు డిజిటల్‌ వీడియో కమర్షియల్స్‌ (డీవీసీలు) ఉన్నాయి. వీటిలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సభ్యులైన షెఫాలీ వర్మ, శిఖా పాండే, తానియా భాటియా, అలీస్‌ కాప్సీ ,తారా నోరిస్‌ కనిపించనున్నారు. ఈ మూడు డీవీసీలు ప్రధానంగా యాత్రికులు తమ టిక్కెట్లను ముందుగా బుక్‌ చేసుకునే సమయంలో ఎదుర్కొనే సందేహాలు మరియు ఈ క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ ఏ విధంగా ఈ ఆందోళనలకు తగిన పరిష్కారం చూపుతుందో వెల్లడిస్తారు.

ట్రావెల్‌ ప్లానింగ్‌ ఒత్తిడితో కూడుకున్నది. మరీ ముఖ్యంగా పరిస్ధితిలను అసలు ఊహించలేనటువంటి పరిస్ధితిలలో ఈ ప్లానింగ్‌ మరింత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. యాత్ర ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను అందించడంతో పాటుగా చివరి నిమిషంలో క్యాన్సిలేషన్స్‌ గురించి ఆందోళన చెందకుండా మీ ప్రయాణ ప్రణాళికలు చేసుకునేందుకు పరిష్కారమూ అందిస్తుంది.

Link of DVC 1 – https://www.instagram.com/reel/Cp5FikOhPly/?igshid=MGU3ZTQzNzY%3D

ఈ క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ మరియు డిజిటల్‌ చిత్రం గురించి యాత్ర ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మరియు హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ ధృవ్‌ ష్రింగి మాట్లాడుతూ ‘‘యాత్రికులు ప్రపంచమంతా అన్వేషించాలనుకుంటుంటారని మేము అర్ధం చేసుకున్నాము. కానీ ఊహాతీత సంఘటనల కారణంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌, బిందాస్‌ ప్లాన్‌ కర్‌ తో మేము మా వినియోగదారులకు తగిన భద్రతను అందించడంతో పాటుగా వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించగలరనే భరోసాని అందిస్తున్నాము.

మా వినియోగదారులకు స్వేచ్ఛాయుత అనుభవాలను అందించాలనే మా నిరంతర ప్రయత్నాలను మా ప్రచారం ప్రతిబింబిస్తుంది. యాత్రికుల ప్రాధాన్యాతలు నిత్యం మారుతూనే ఉన్నాయి మరియు సౌకర్యవంతమైన, అనుకూలమైన ,అందుబాటు ధరలలో తమ ప్రయాణ ప్రణాళికలను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.

Yatra Online Ltd

ఈ బిందాస్‌ ప్లాన్‌ కర్‌ ప్రచారం ఇప్పుడు ట్రావెల్‌ పరిశ్రమలో విప్లవాత్మక ఆవిష్కరణగా మారడంతో పాటుగా వినియోగదారుకు వినూత్నమైన, విలువైన ఫీచర్‌గా నిలువనుంది. ఇది పోటీదారుల కంటే ప్రత్యేకంగా యాత్ర డాట్‌ కామ్‌ను నిలుపనుంది. యాత్ర డాట్‌ కామ్‌పై అన్ని దేశీయ ఫ్లైట్స్‌పై ఈ క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది.

బిందాస్‌ ప్లాన్‌కర్‌ ప్రచారం ద్వారా తమ ట్రావెల్‌ ప్రణాళికలను ఒత్తిడి రహితంగా మార్చడంతో పాటుగా సౌకర్యవంతంగా యాత్ర డాట్‌ కామ్‌ వినియోగదారులకు మారుస్తుంది. వినియోగదారుల సంతృప్తి పట్ల యాత్ర ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ యొక్క నిబద్ధత కారణంగా, వినియోగదారులు ఇప్పుడు తమ ట్రిప్స్‌ను పూర్తి ఆత్మవిశ్వాసంతో , సులభంగా ప్రణాళిక చేసుకోవచ్చు.

Leave a Reply