వెంకీ మామ ను లైన్ లో పెట్టిన జాతి రత్నాలు డైరెక్టర్…
విక్టరీ వెంకటేశ్ .. తాను చేసే ప్రతి మూవీ తన మనసుకు నచ్చితేనే చేస్తాడు అది రీమేక్ మూవీ అయినా స్ట్రెయిట్ మూవీ అయిన . గతేడాది విక్టరీ వెంకటేశ్ రెండు సినిమాల్లో నటించాడు , వాటిలో ఒకటి దృశ్యం 2 మూవీ , మరొకటి నారప్ప మూవీ .. ఇక ఈ రెండు మూవీస్ మహమ్మారి కరోనా కారణంగా ధియేటర్స్ లో రిలీజ్ కాలేదు .. ఇక ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి .. ఫ్యామిలీ హీరో వేంకేటేశ్ సినిమాలు థియేటర్స్ లో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది .. దృశ్యం సినిమా కు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 మూవీ ట్రైలర్స్ టీజర్స్ , వెంకటేశ్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కానీ కరోనా కారణం వల్ల ఈ మూవీ ని ఓటీటీలో లో రిలీజ్ చేశారు మేకర్స్ ,, ఈ మూవీ తరువాత మరో రీమేక్ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్’కి రీమేక్ గా నారప్ప సినిమా తెరకెక్కింది.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ మూవీ థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడి , ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది.
3.Venkatesh
Thumb : “సీనియర్ స్టార్ హీరో ను లైన్ లో పెట్టిన జాతి రత్నాలు డైరెక్టర్ ‘”
” గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న డైరెక్టర్ అనుదీప్ “
” సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో మూవీ చేయబోతున్న యంగ్ డైరెక్టర్”
విక్టరీ వెంకటేశ్ .. తాను చేసే ప్రతి మూవీ తన మనసుకు నచ్చితేనే చేస్తాడు అది రీమేక్ మూవీ అయినా స్ట్రెయిట్ మూవీ అయిన . గతేడాది విక్టరీ వెంకటేశ్ రెండు సినిమాల్లో నటించాడు , వాటిలో ఒకటి దృశ్యం 2 మూవీ , మరొకటి నారప్ప మూవీ .. ఇక ఈ రెండు మూవీస్ మహమ్మారి కరోనా కారణంగా ధియేటర్స్ లో రిలీజ్ కాలేదు .. ఇక ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి .. ఫ్యామిలీ హీరో వేంకేటేశ్ సినిమాలు థియేటర్స్ లో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది .. దృశ్యం సినిమా కు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 మూవీ ట్రైలర్స్ టీజర్స్ , వెంకటేశ్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కానీ కరోనా కారణం వల్ల ఈ మూవీ ని ఓటీటీలో లో రిలీజ్ చేశారు మేకర్స్ ,, ఈ మూవీ తరువాత మరో రీమేక్ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్’కి రీమేక్ గా నారప్ప సినిమా తెరకెక్కింది.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ మూవీ థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడి , ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది.
ఇక అసలు విషయానికి వెళ్ళితే మహమ్మారి కరోనా తగ్గుముఖం పట్టి నెమ్మదిగా ఒక్కో మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి సందడి చేస్తుంది ‘.. లాంగ్ గ్యాప్ తరువాత ఎఫ్3 దియేటర్స్ ప్రేక్షకులను పలకరించేందుకు వెంకీ సిద్దమవుతున్నాడు. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఎఫ్3 మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది , ఇక ఈ మూవీ తర్వాత వెంకీ చేయబోయే లేటెస్ట్ మూవీ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. వెంకీ డైరెక్టర్ త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్‌లతో సినిమాలు చేయాల్సి ఉన్నా..అవి ఇంకా ఫైనల్ కాలేదు ..
ప్రస్తుతం వెంకటేశ్ నెట్ ఫ్లిక్స్ కోసం రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రానా కూడా ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత వెంకీ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే అది త్రివిక్రమ్ లేదా తరుణ్ భాస్కర్‌తో కాదు. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్‌తో మూవీ చేయబోతున్నాడట. ఇటీవల డైరెక్టర్ అనుదీప్ వెళ్లి వెంకీకి కథ వినిపించి ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ హీరో శివకార్తికేయన్‌తో తెలుగు తమిళ బైలింగువల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే వెంకీని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ..మొత్తానికి ఎఫ్ 3 మూవీ తరువాత వెంకటేశ్ చేయబోయే మూవీ పై ఒక క్లారిటీ వచ్చింది …